
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాకు కేంద్రం అన్యాయం చేస్తుందని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై ఎవరైనా చర్చకు వస్తారేమో రండి.. అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులకు పొన్నం సవాల్ విసిరారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ల మధ్య ఇదే అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు చర్చకు రావాలంటూ పొప్నం సవాల్ చేశారు.
పొన్నం ప్రభాకర్ సవాల్ ను స్వీకరిస్తున్నా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ పొన్నం ప్రభాకర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం ద్వారా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చ జరపాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం’ అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
దీనికి కౌంటర్ గా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర బీజేపీ లేఖ విడుదల చేయాలి. మూసీకి నిధులు ఇవ్వాలి, మూసీకి నిధులు ఇవ్వాలి. కరీంనగర్ నుంచి మంచిర్యాల వరకూ రైల్వే లైన్ ఇవ్వాలి. తెలంగాణ కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చేలాగ రాష్ట్ర బీజేపీ ప్రయత్నం చేయాలి’ అని పొన్నం స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment