సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో రేపటి(గురువారం) బీజేపీ బహిరంగ సభను వాయిదాను వేసినట్టు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని పిలుపునిచ్చారు. అయితే, ఈనెల 25వ తేదీన నాగర్ కర్నూల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ యథావిధిగా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
కాగా, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఖమ్మం బహిరంగ సభను వాయిదా వేశాం. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో బిపర్‌జాయ్ తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్ దళాల పర్యవేక్షణ బాధ్యతలు అమిత్ షాపై ఉన్నాయి. అందుకే సభను వాయిదా వేశాం. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో సభ వద్దనుకుని నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించడం గ్యారెంటీ. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఎప్పుడు అనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
బిపర్‌జాయ్ తుపాను కారణంగా దాదాపు 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పలు రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. ప్రజలను అన్ని విధాల సాయం అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. కార్యకర్తల నారాజ్!
Comments
Please login to add a commentAdd a comment