నేడు (ఆగస్టు 19) దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం విశిష్టమైనదని, దీనికి ప్రతీకగా రాఖీ జరుపుకుంటారని అన్నారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి రక్షాబంధన్ ఒక ప్రతీక అని, ఈ పండుగను మతపరమైన సరిహద్దులను దాటి జరుపుకోవడం విశేషమన్నారు.
మహిళలకు గౌరవం అందించడంతోపాటు, వారి హక్కులను పరిరక్షించాలనే సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఈ పండుగ దోహదపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు (సోమవారం) అదనంగా మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఇదేవిధంగా ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ కూడా అదనంగా బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.
President Droupadi Murmu extends Raksha Bandhan greetings
Read @ANI Story | https://t.co/NeXkXdRoLO#PresidentMurmu #RakshaBandhan #DroupadiMurmu pic.twitter.com/OFYFbD2UXm— ANI Digital (@ani_digital) August 18, 2024
Comments
Please login to add a commentAdd a comment