రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్త కాంతులు నింపాలని బుధవారం ఆయన ఆకాంక్షించారు. అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో జీవించేందుకు, రాష్ట్ర భూముల్లో బంగారు పంటలు పండేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దిగ్విజయంగా ముందుకు సాగేలా భగవంతుడు దీవించాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.