సంక్రాంతికి ఫాంహౌస్లోనే కేసీఆర్ ! | KCR sankranthi festival celebrations in farmhouse | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఫాంహౌస్లోనే కేసీఆర్ !

Published Thu, Jan 14 2016 7:57 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

సంక్రాంతికి ఫాంహౌస్లోనే కేసీఆర్ ! - Sakshi

సంక్రాంతికి ఫాంహౌస్లోనే కేసీఆర్ !

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఆయన తన ఫాంహౌస్లోనే జరుపుకోనున్నారు. ఈ పండగ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబసభ్యులు ఫాంహౌస్కి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ నెల 8వ తేదీన కేసీఆర్ ఫాంహౌస్కు వచ్చారు. ఆయన దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

అనంతరం దుబ్బాకలో ఆయన చదివిన పాఠశాల ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారు. మరునాడు మళ్లీ ఫాంహౌస్కు చేరుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలోని అల్లం పంటలను కేసీఆర్ పరిశీలించారు. మరో మూడు రోజుల వరకు కేసీఆర్ ఫాంహౌస్లోనే ఉంటారని సమాచారం. అయితే ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement