
వేడుకలు ఘనంగా జరుపుకోవాలి: బాబు
రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబుసంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబుసంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ, విదేశాల్లోని తెలుగువారు భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను ఘనంగా చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పేద కుటుంబాలు పెద్ద పండుగను సంతోషంగా చేసుకోవాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు.