![Chandrababu went to his home town Naravaripalle for Sankranthi festival - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/15/cmm.jpg.webp?itok=fV-kvI_J)
ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న సీఎం
చంద్రగిరి: సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి చేరుకున్నారు. కాశిపెంట్లోని హెరిటేజ్‌లో ఓ కార్యక్రమం ముగించుకుని, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలసి ఇంటికి చేరుకున్నారు. స్థానికుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలని తిరుపతి సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుని సా.6 గంటలకు మరోమారు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment