
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునర్జన్మకు సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పర్వదినం జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈస్టర్ పండుగ సమాజంలో సానుకూల దృక్పథాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ పర్వదినం మనకు కరోనాపై పోరాడటానికి శక్తినివ్వాలని, సాధారణ జనజీవనం పునరుద్ధరించబడాలని ఈ సందర్భంగా గవర్నర్ అభిలషించారు.
Comments
Please login to add a commentAdd a comment