
ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. లోకంలోని ప్రజలందర్నీ రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని వైఎస్ జగన్ అభిలాషించారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు.