
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చూడాలన్నారు. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలబద్ద అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వానికి విజయం చేకూరాలని, సుఖశాంతులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment