
తెలుగువారికి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
దీపావళి పండగ కోసం చేసే ఖర్చులో కొంత భాగం హుదూద్ తుపాన్ బాధితులకు అందించాలని జగన్ కోరారు. తుపాన్ తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రకు సాయం చేయాలని వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.