
న్యూ ఇయర్.. గ్రీటింగ్స్
ఎంత ఘనంగా స్వాగతం పలుకుతామో... అంతే గొప్పగా మిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పడం న్యూ ఇయర్ స్పెషల్. కంప్యూటర్ యుగం...
ఎంత ఘనంగా స్వాగతం పలుకుతామో... అంతే గొప్పగా మిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పడం న్యూ ఇయర్ స్పెషల్. కంప్యూటర్ యుగం... స్మార్ట్ ఫోన్ల రాజ్యం... ఎస్‌ఎంఎస్‌ల మయం. అయినా ఆనాటి నుంచి ఈ నాటి వరకు గ్రీటింగ్ కార్డ్స్‌కు క్రేజ్ తగ్గలేదు. విభిన్నమైన డిజైన్లు.. థీమ్‌లతో పైన ఎంతగా ఆకట్టుకుంటుందో... తెరిచి చూస్తే ఆత్మీయత, అనుబంధాన్ని ప్రతిబింబించేలా అంతే చక్కని సందేశాలు... ప్రియమైనవారి చేవ్రాలుతో మనసుకు హత్తుకుంటుంది.
కలకాలం ఓ మధుర జ్ఞాపకంలా మనతోనే నిలిచిపోతుంది. టెక్నాలజీలో దూసుకుపోతున్నా... నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారినా... ‘సమ్‌వన్ స్పెషల్’కు ‘సమ్‌థింగ్ స్పెషల్’ ఎప్పుడూ గ్రీటింగ్ కార్డులే. ఈసారి న్యూ ఇయర్‌కు సిటీలో షాపుల్లో విభిన్నమైన గ్రీటింగ్ కార్డ్స్ కొలువుదీరాయి. యువతరం వాటిపై ఇంకా మనసు పారేసుకుంటూనే ఉంది. సికింద్రాబాద్‌లోని ఓ గ్రీటింగ్ షాప్‌లో మంగళవారం దృశ్యమిది.