పాకిస్తాన్‌కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం | United States Provide 30 Million Dollars Aid To Pakistan For Floods | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం

Published Tue, Aug 30 2022 9:37 PM | Last Updated on Tue, Aug 30 2022 9:37 PM

United States Provide 30 Million Dollars Aid To Pakistan For Floods - Sakshi

ఇస్లామాబాద్‌: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి పాకిస్తాన్‌ అల్లకల్లోలంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్‌లో ప్రకృతి విలయం సృష్టించింది. దీంతో వేలాదిమంది చనిపోయారు, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో  పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రపంచ దేశాలను సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది.

ఈ మేరకు అమెరికా పాకిస్తాన్‌కి సుమారు రూ. 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నెషనల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా పాకిస్తాన్‌లోని వరద బాధితుల కోసం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడానికి, ప్రాణాలను రక్షించేందుకు ఈ మానవతా సాయాన్ని అందిస్తున్నట్లు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది

(చదవండి: అఫ్గాన్‌ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్‌...ఐ డోంట్‌ కేర్‌ అంటున్న రష్యా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement