AP CM YS Jagan Grants Rs 22 Lakhs Aid For Konaseema 7 Years Old Child Treatment - Sakshi
Sakshi News home page

CM YS Jagan: పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్‌ 

Published Sat, Nov 5 2022 7:56 AM | Last Updated on Sat, Nov 5 2022 8:28 AM

CM YS Jagan Grants Rs 22 Lakh Aid For Child Treatment - Sakshi

యశ్వంత్‌ పరిస్థితిని సీఎం జగన్‌కు వివరిస్తున్న వెంకటేశ్వరబాబు

అమలాపురం రూరల్‌(కోనసీమ జిల్లా): తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్‌(7) చికిత్సకు సీఎం వైఎస్‌ జగన్‌ సహాయం అందించారు. బాలుడు హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి రూ.22 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

శుక్రవారం గోకవరం మండలం గుమళ్లదొడ్డిలో ఇథనాల్‌ ప్రాజెక్ట్‌ శంకుస్థాపనకు వచ్చిన సీఎంను గోదావరి సెంట్రల్‌ డెల్టా బోర్టు చైర్మన్‌ కుడుపూడి వెంకటేశ్వరబాబు కలిశారు. బాలుడు తండ్రి ఆర్థిక పరిస్థితిని విన్నవించారు. దీనిపై చలించిన సీఎం వెంటనే స్పందించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ. 22 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సంతకం చేసి కార్యదర్శి జవహర్‌రెడ్డికి అందజేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement