
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లెలో బుధవారం సీఎం వస్తున్న దారిలో హమీదా అనే మహిళ తన ఏడాదిన్నర వయసున్న చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని ‘జగనన్నా.. నా బిడ్డను కాపాడన్నా’ అని వేడుకుంది. బస్సులో నుంచి ఆ దృశ్యం గమనించిన సీఎం.. ఆమెను సభాస్థలి వద్దకు పిలిపించారు. ‘అన్నా.. నా కుమారుడు షేక్ మహమ్మద్ అలీ తల రోజు రోజుకూ పెరిగిపోతోంది. వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చూపించాం.
తలకు ఆపరేషన్ చేయాలని, చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. మేం పేదోళ్లం. ఎలాగైనా మీరే ఆదుకోవాలి’ అని కన్నీటిపర్యంతమైంది. చిన్నారి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. తక్షణ వైద్య ఖర్చులకు రూ.లక్ష, చిన్నారికి రూ.3 వేల పింఛన్ మంజూరు చేయాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గిరీషా హమీదాకు రూ.లక్ష సాయం అందజేశారు. స్విమ్స్‌లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
చదవండి: జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం
Comments
Please login to add a commentAdd a comment