సీఎం జగన్‌ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం  | AP CM Relief Fund: Rs 41.5 Lakh Aid For Child Treatment - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం 

Aug 29 2023 7:52 AM | Updated on Aug 29 2023 8:47 AM

Ap Cm Relief Fund: Rs 41 5 Lakh Aid For Child Treatment - Sakshi

సీఎం సహాయనిధి చెక్కు అందిస్తున్న బేబీ మీనాక్షి, డాక్టర్‌ శ్రీకాంత్‌

బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు.

అమలాపురం రూరల్‌: బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది.  తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్‌ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు.

చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ద్వారా తీసుకువెళ్లారు.

ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్‌ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్‌ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ సోమవారం ఆ  కుటుంబానికి అందజేశారు.
చదవండి: దమ్ము లేకనే.. దత్తపుత్రుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement