
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు వివాదంలో హిందూ–ముస్లిం జంటకు సాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను హేళన చేస్తూ పలువురు నెటిజెన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తనను లక్ష్యంగా చేసుకుని పోస్ట్ చేసిన ట్వీట్లను సుష్మ రీట్వీట్ చేశారు. అందులో ఓ నెటిజెన్ స్పందిస్తూ..‘సుష్మా జీ ఒక్క కిడ్నీపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణమైనా ఆ కిడ్నీ కూడా పనిచేయడం మానేస్తుంది’ అని అన్నాడు. సుష్మ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించినందుకు సిగ్గు పడుతున్నానని మరొకరు పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment