Hindu-Muslim
-
విద్వేష సిద్ధాంతాలతో దేశ పునాదుల్ని బలహీనపరిచే కుట్ర
న్యూఢిల్లీ: పటిష్ట పునాదులపై సమున్నతంగా నిల్చున్న భారత వారసత్వాన్ని బలహీనపర్చే కుట్రకు బీజేపీ తెర తీసిందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విభజన సిద్ధాంతాలతో దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ దేశానికి హాని తలపెడుతోందని బీజేపీని సోనియా తూర్పారబట్టారు. కాంగ్రెస్ 137 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ సోనియా వీడియో సందేశమిచ్చారు. ‘భారత దేశ సంస్కృతిలో ఒకటిగా కలిసిపోయి, అద్భుతంగా పరిఢవిల్లుతున్న హిందూ–ముస్లిం మత సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నియమాలను పక్కకుతోసి నియంత పాలన కొనసాగుతోంది’ అని సోనియా ధ్వజమెత్తారు. ‘ ఇకపై ఈ దారుణాలకు కాంగ్రెస్ మౌన సాక్షిగా ఉండబోదు. దేశ వారసత్వ భావాలను చెరిపేసే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుంది’ అని ఆమె హామీ ఇచ్చారు. ‘ భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం, పాత్ర లేని కొన్ని విభజన, విద్వేష శక్తులు ప్రస్తుతం దేశ లౌకికగుణాన్ని నాశనం చేసే దారుణానికి ఒడుగడుతున్నాయి’ అని పరోక్షంగా బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ‘ అర్హత లేకున్నా తమకూ దేశ చరిత్రలో స్థానం కల్పించుకునేందుకు చరిత్రను తిరగరాసే యత్నం చేస్తున్నారు’ అని సోనియా అన్నారు. కాగా, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండాను ఎగరేస్తుండగా హఠాత్తుగా జెండా నేలరాలింది. -
ఆ ఒక్క కిడ్నీ ఆగిపోతుంది!
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు వివాదంలో హిందూ–ముస్లిం జంటకు సాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను హేళన చేస్తూ పలువురు నెటిజెన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తనను లక్ష్యంగా చేసుకుని పోస్ట్ చేసిన ట్వీట్లను సుష్మ రీట్వీట్ చేశారు. అందులో ఓ నెటిజెన్ స్పందిస్తూ..‘సుష్మా జీ ఒక్క కిడ్నీపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణమైనా ఆ కిడ్నీ కూడా పనిచేయడం మానేస్తుంది’ అని అన్నాడు. సుష్మ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించినందుకు సిగ్గు పడుతున్నానని మరొకరు పోస్ట్ చేశారు. -
సర్వమత పర్వం
పీస్ ఫెస్టివల్ - గజవెల్లి రాజు, సాక్షి, పోచమ్మ మైదాన్, వరంగల్ అది 1993వ సంవత్సరం. దీపావళి పండుగ రోజు. హిందువుల పిల్లలు టపాసులు కాలుస్తూ ఆనందంగా గడుపుతున్నారు. దీన్ని చూసిన హన్మకొండ జులైవాడకు చెందిన ఇద్దరు ముస్లిం చిన్నారులు దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకోవడం లేదని తమ తండ్రి మహ్మద్ సిరాజుద్దీన్‌ను ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆయనలో ఈ ప్రశ్న కొత్త ఆలోచనలకు తెర తీసింది. మతాలు, కులాల వారీగా కాకుండా అందరూ కలిసి జరుపుకునేందుకు పండుగలే లేవా అని ప్రశ్నించుకున్న సిరాజుద్దీన్లో రెండేళ్ల పాటు సాగిన అంతర్మథనంలోంచి ‘ప్రపంచ శాంతి పండుగ’ ఆవిర్భవించింది. సమితి ఆమోదం తన పిల్లలు వేసిన ప్రశ్నతో 1995లో ప్రపంచ శాంతి పండగ పేరిట ఓ పుస్తకాన్ని రాశారు సిరాజుద్దీన్. ఆ పుస్తకాన్ని 1996లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీకి పంపించారు. దానికి స్పందనగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని శాంతి పండుగను జరుపుకోవాలని సూచిస్తూ సమితి కార్యాలయం నుంచి సిరాజుద్దీన్‌ను లేఖ అందింది. ఏటా ఫిబ్రవరి 28న నాలుగేళ్లకోసారి వచ్చే లీపు సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఫిబ్రవరి నెలలో 28వ తేదీన ప్రపంచ శాంతి పండగను నిర్వహించాలని సిరాజుద్దీన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు చెబితే.. ఎవరు వచ్చినా, రాకున్నా మనమిద్దరమే పండుగ జరుపుకుందామని చెప్పారు. అలా తొలిసారి 1997 ఫిబ్రవరి 28న హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో రెండు టెంట్లు వేశారు. ప్రతీ టెంట్లో అన్ని కులాలు, మతాల వారు ఉన్నారు. ఇంతలో ఓ టెంట్లో నుంచి మహిళలు మరో టెంట్‌లోకి వెళ్లి తమ పండుగకు రావాలని ఆహ్వానించగా.. అందరూ కలిసి రెండు టెంట్ల నడుమ శాంతి జెండా ఎగరవేశారు. ఇక పురుషులూ పిలుచుకుని శాంతి కపోతాలు ఎగరవేశారు. అనంతరం అందరూ ఆప్యాయంగా, సందడిగా గడిపారు. అలా శాంతి పండుగ ప్రారంభమైంది. ఫొటో: సంపెట వెంకటేశ్వర్లు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే వారిని గుర్తించి 2007 సంవత్సరం నుంచి ‘శాంతి దూత’ అవార్డులు ఇస్తున్నాం. ఈ యేడు హన్మకొండలోని రాయల్ గార్డెన్స్‌లో జరుగుతున్న వేడుకల్లో చందుపట్ల దేవేందర్‌రెడ్డి, డాక్టర్ అద్దెపల్లి రామ్మోహన్రావు, ప్రొఫెసర్ కోదండరామ్‌లకు అవార్డులు ప్రదానం చేయనున్నాం. - మహ్మద్ సిరాజుద్దీన్, ఫౌండర్, వరల్డ్ పీస్ ఫెస్టివెల్ సొసైటీ ఇంటర్నేషనల్