
నేపాల్ కు భారత్ భారీ ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: భారత్, నేపాల్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన నేపాల్ ప్రధాని ప్రచండ, నరేంద్రమోదీలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. నేపాల్ భూకంప బాధితులకు సహాయార్థం భారత్ దాదాపు రూ. 5,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ప్రచండ గురువారం భారత్ చేరుకున్నారు. ప్రచండ మొదటి సారి ఇండియాలో పర్యటిస్తున్నారు.