- విజయవాడ ప్యాసింజర్ కూడా..
నేడు శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
Published Sat, Sep 24 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
కాజీపేట రూరల్ : విజయవాడ రైల్వేస్టేçÙ¯ŒS రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం ఆధునీకరణ పనులను పురస్కరించుకుని ఆదివారం శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను అప్ అండ్ డౌ¯ŒS మార్గంలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సికిం ద్రాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే శాతవాహన రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కాజీపేట జంక్ష¯ŒS నుంచి ఉదయం 4 గంటలకు విజయవాడకు వెళ్లే ప్యాసింజర్ రైలును కూడా రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు.
రైల్వే వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు..
కాజీపేట సబ్ డివిజ¯ŒS పరిధిలోని రైల్వే వంతెనల వద్ద అధికారులు నిఘా గస్తీ ముమ్మరం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైలు కట్టలకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎలుగూరు–నెక్కొండ మార్గంలోని వాటర్ లెవెల్ క్రాసింగ్ వద్ద, గుండ్రాతిమడుగు–డోర్నకల్ మధ్యలోని రైల్వే వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి గస్తీ ముమ్మరం చేశారు. అలాగే కాజీపేట జంక్ష¯ŒSలో మా¯ŒSసూ¯ŒS గస్తీ రైలును సిద్ధం చేశారు. స్టేష¯ŒS ఘ¯ŒSపూర్, డోర్నకల్, కాజీపేట మార్గాలకు వెళ్లే గస్తీ రైలులో ఇసుక బస్తాలు, బోల్డర్స్ మెటీరియతో పాటు ఎమర్జెన్సీ సిబ్బందిని అప్రమత్తం చేసి రెడీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Advertisement