shatavahana express
-
నేడు శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
విజయవాడ ప్యాసింజర్ కూడా.. కాజీపేట రూరల్ : విజయవాడ రైల్వేస్టేçÙ¯ŒS రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం ఆధునీకరణ పనులను పురస్కరించుకుని ఆదివారం శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను అప్ అండ్ డౌ¯ŒS మార్గంలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సికిం ద్రాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే శాతవాహన రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కాజీపేట జంక్ష¯ŒS నుంచి ఉదయం 4 గంటలకు విజయవాడకు వెళ్లే ప్యాసింజర్ రైలును కూడా రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. రైల్వే వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు.. కాజీపేట సబ్ డివిజ¯ŒS పరిధిలోని రైల్వే వంతెనల వద్ద అధికారులు నిఘా గస్తీ ముమ్మరం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైలు కట్టలకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎలుగూరు–నెక్కొండ మార్గంలోని వాటర్ లెవెల్ క్రాసింగ్ వద్ద, గుండ్రాతిమడుగు–డోర్నకల్ మధ్యలోని రైల్వే వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి గస్తీ ముమ్మరం చేశారు. అలాగే కాజీపేట జంక్ష¯ŒSలో మా¯ŒSసూ¯ŒS గస్తీ రైలును సిద్ధం చేశారు. స్టేష¯ŒS ఘ¯ŒSపూర్, డోర్నకల్, కాజీపేట మార్గాలకు వెళ్లే గస్తీ రైలులో ఇసుక బస్తాలు, బోల్డర్స్ మెటీరియతో పాటు ఎమర్జెన్సీ సిబ్బందిని అప్రమత్తం చేసి రెడీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
శాతవాహన ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
- బోగీలు ఊగడంతో భయకంపితులైన ప్రయాణికులు - చైన్‌లాగి ఆపివేత..10 నిముషాల తర్వాత బయలుదేరిన రైలు డోర్నకల్(వరంగల్ జిల్లా): మెయిన్‌లైన్‌లో గూడ్సురైలు ఉండడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను లూప్లైన్లో వదిలారు. అయితే లూప్‌లైన్ పట్టాలు బలహీనంగా ఉండడంతో రైలు మామూలు పట్టాలపై వెళ్లినట్లు వేగంగా వెళ్లడంతో బోగీలన్నీ ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై కేకలు వేస్తూ చైన్ లాగి రైలును ఆపేశారు. ఈ సంఘటన మహబూబాబాద్- డోర్నకల్ మార్గంలో గుండ్రాజుమడుగు రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. రైలు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఏదో ప్రమాదం జరుగుతోందని రైలుదిగి పరుగులు తీశారు. రైల్వే స్టేషన్ మాస్టర్ జరిగిన పరిస్థితిని విచారణ చేశారు. లూప్లైన్లో రైలును వదిలినందువల్ల పరిమితికి మించి వేగంతో రైలు వెళ్లడంతో పట్టాలపై ఒత్తిడి పెరిగి బోగీలు అటూ ఇటూ ఊగాయని, అంతే తప్ప ప్రమాదం జరగలేదని వివరించారు. అయితే రైలు డ్రైవర్ జాగ్రత్తగా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొన్ని నిముషాల పాటు ఆగిన రైలు మళ్లీ బయలుదేరింది. రైలు డోర్నకల్ చేరిన తర్వాత అక్కడ కూడా ప్రయాణికులు దిగి రైలు డ్రైవర్‌పై ఫిర్యాదుచేశారు. రైలును జాగ్రత్తగా నడపేలా డ్రైవర్ కు సూచించాలని రైల్వే అధికారులను కోరారు. ఆమేరకు స్టేషన్‌మాస్టర్ రైలు డ్రైవర్‌కు సూచనలు చెప్పారు.