AP Kadapa Police Constable Jumps Into Action Rescues A Man From Being Washed Away - Sakshi
Sakshi News home page

Kadapa Police Constable: శభాష్‌ నరేంద్ర.. వరదను సైతం లెక్క చేయక

Published Thu, Sep 30 2021 3:25 PM | Last Updated on Thu, Sep 30 2021 7:24 PM

AP Kadapa Police Constable Jumps Into Action Rescues A Man From Being Washed Away - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ఖాకీలంటే నేటికి కూడా సమాజంలో చాలా మందికి ఒకలాంటి భయం.. బెరుకు. పోలీసులను చూడగానే పారిపోయే వారు నేటికి కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నేచర్‌ వల్ల పోలీసులకు-జనాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఇక ఖాకీలంటే కఠినంగా ఉండటమే కాదు.. ఆపదలో ఉంటే ముందుగా స్పందించేది కూడా వారే. ఇందుకు నిదర్శనంగా నిలిచిన సంఘటనలు ఎన్నో. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. భారీ వరదలో చిక్కుకుపోయిన వ్యక్తిని కొట్టుకుపోకుండా కాపాడి.. జనాల ప్రశంసలు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లాకు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆ వివరాలు..
(చదవండి: కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మ)

గులాబ్‌ తుపాన్‌ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. వరద నీరు రోడ్లకు మీదకు చేరి ప్రజా రవాణాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కడప జిల్లాలో చెరువు పొంగి రోడ్డు మీదుగా ప్రవహించడం ప్రారంభించింది. దాంతో అదే రోడ్డు మార్గంలో బైక్‌ మీద వస్తోన ఓ వ్యక్తి వరద ధాటికి తట్టుకోలేక బండి మీద నుంచి పడిపోయాడు. రెండు క్షణాలు ఆలస్యం అయి ఉంటే అతడు కూడా వరదలో కొట్టుకుపోయేవాడు. 
(చదవండి: నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం)

ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో పోలీసు కానిస్టేబుల్‌ నరేంద్ర అక్కడే ఉన్నాడు. సదరు వ్యక్తి బైక్‌ మీద నుంచి పడగానే అప్రమత్తమైన నరేంద్ర.. వరదను లెక్క చేయకుండా వెళ్లి.. అతడు కొట్టుకుపోకుండా కాపాడాడు. వరదకు భయపడకుండా.. ప్రాణాలను పణంగా పెట్టి మరి ఆ వ్యక్తిని కాపాడినందుకు కానిస్టేబుల్‌ నరేంద్రను ప్రశంసించారు జనాలు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తమ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. 
చదవండి: తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్‌ తుపాన్‌ పాకిస్తాన్‌ వైపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement