సాక్షి, మహబూబాబాద్: రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో వరదలో చిక్కుకుపోయిన భార్య కోసం ఓ భర్త సాహసం చేశాడు. భార్యను కాపాడటం కోసం వరదలో అలానే వెళ్లి.. ఆమెను కాపాడుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏజెన్సీ మట్టెవాగు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగాయి. ఈ క్రమంలో మొక్కజొన్న చేను కావలికి వెళ్లిన సుభద్ర అనే మహిళ వాగులో చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న భర్త విజయ్ భార్యను కాపాడటం కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును సైతం లెక్కచేయకుండా సాహసం చేశాడు. వాగులో ఈదుకుంటూ వెళ్లి.. తాడు సాయంతో భార్యను ఒడ్డుకు చేర్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. వరదలు వచ్చిన ప్రతిసారి ఇలానే జరుగుతుందని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. దొరవారి పాలేంలో బ్రిడ్జీ నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు.
Comments
Please login to add a commentAdd a comment