
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సర్కార్ ఎంతటి సాయం చేయడానికైనా సిద్దమని తెలిపారు. బాధితుల మొఖాలలో ఓవైపు తీరని ఆవేదన.. మరోవైపు అన్నా’ వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు.

గుండె కరిగిపోయే దృశ్యాలు…
మనసు చెదిరిపోయే కష్టాలు…
స్వయంగా చూశాను.
బాధితుల మొఖాలలో …
ఒకవైపు తీరని ఆవేదన…
మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా.
వీళ్ల కష్టం తీర్చడానికి…
కన్నీళ్లు తుడవడానికి…
ఎంతటి సాయమైనా
చేయడానికి సర్కారు సిద్ధం.#TelanganaRains2024 pic.twitter.com/0NQPobJsd5— Revanth Reddy (@revanth_anumula) September 3, 2024
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రోడ్లు పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment