heavy rains in telangana
-
గుండె కరిగిపోయే, మనసు చెదిరిపోయే దృశ్యాలు చూశా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సర్కార్ ఎంతటి సాయం చేయడానికైనా సిద్దమని తెలిపారు. బాధితుల మొఖాలలో ఓవైపు తీరని ఆవేదన.. మరోవైపు అన్నా’ వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు.గుండె కరిగిపోయే దృశ్యాలు…మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశాను.బాధితుల మొఖాలలో …ఒకవైపు తీరని ఆవేదన…మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా.వీళ్ల కష్టం తీర్చడానికి…కన్నీళ్లు తుడవడానికి…ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం.#TelanganaRains2024 pic.twitter.com/0NQPobJsd5— Revanth Reddy (@revanth_anumula) September 3, 2024మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రోడ్లు పరిశీలించనున్నారు. -
Telangana: భారీ నుంచి అతి భారీవర్షాలు.. అయిదు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అయిదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో మిగతా జిల్లాలకు అరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. వచ్చే 24 గంట ల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముంది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతోంది. రుతుపవనాల ద్రోణి ఇప్పుడు సముద్రమట్టం వద్ద జైసల్మేర్ నుంచి వాయవ్యకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతతీరం, ఆగ్నేయదిశ గా ఉత్తర అండమాన్ సముద్రం వరకూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మంగళవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండ్రోజులు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. చదవండి: hyderabad: మట్టిగణపతుల తయారీ.. సగానికి తగ్గిన వ్యయం గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 24 గంటల్లో కొము రంభీం జిల్లా బెజ్జూరులో 11 సెం.మీ. భారీ వర్షం కురిసింది. జూలూరుపాడు, ఆసిఫాబాద్, పేరూరులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వెంకటాపురం, పెద్దపల్లి, సత్తుపల్లిలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
TS: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా, దాన్ని అనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీ డనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. నగరంలోనే కాదు.. శివారుల్లోనూ వాగులు, వంగులు పొంగిపోర్లుతుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. జంట నగరాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల నీటి తొలగింపు సమస్యగా మారి.. ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. వికారాబాద్, శంకర్‌పల్లిలో భారీగా వర్షం కురుస్తుండడంతో.. గండిపేట జలాయశానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. తాండూరు-వికారాబాద్, పరిగి-వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. Today - Moderate Rains During Evening/Night Time. Tomorrow - Heavy Rains Likely from Afternoon -Early Morning. — Hyderabad Rains (@Hyderabadrains) July 26, 2022 గరిష్టంగా వికారాబాద్‌లో 12 సెం.మీ, నగరంలో హస్తినాపురంలో వర్షపాతం నమోదు అయ్యింది. మూసారంబాగ్-గోల్నాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట్ రైల్వే స్టేషన్ కింద నీరు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉన్నారు. #StayAway from power transformers, power poles & wires. #Heavy_rain #Massive_floods #rain #HyderabadRains #flood #floods #StayAlert.@TelanganaDGP @CommissionrGHMC @TelanganaCOPs @hydcitypolice @cyberabadpolice @TS_SheTeams @ts_womensafety @Rachakonda_tfc @sheteams_rck pic.twitter.com/L5dR4SpkfB — Rachakonda Police (@RachakondaCop) July 26, 2022 Mallepally area of #Hyderabad at night due to heavy #Rains pic.twitter.com/zArxpOaIMc — Sandeep Dhar (@sandeepdhar10) July 26, 2022 #ALERT Next 2hrs forecast ⚠️#HeavyRain continue all over #Vikarabad #Hanmakonda #Jangaon #Peddapalli #Mancherial #Adilabad #Gadwal . RAINS in Nizamabad, Kamareddy, Medak, Karimnagar, Mahabubnagar, Narayanpet, Sircilla, Asifabad and Jagitial districts Less rains in #Hyderabad pic.twitter.com/aEXSivW651 — Praja Sangram Yatra 3 (@sandeep_muttagi) July 26, 2022 -
TS: రానున్న 2 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: వదలని వాన వణికిస్తోంది. రాష్ట్రంలో రెండ్రోజులుగా నమోదవుతున్న వర్షాలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమవుతుండగా.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పది జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.16 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 16.76 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో శనివా రం వరకు రాష్ట్రంలో 30.46 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, రెట్టింపునకు పైగా 63.66 సెంటీమీ టర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలి పింది. సాధారణ వర్షపాతం కంటే 109% అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కొనసాగుతున్న ఉపరితలద్రోణి రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసా గుతోంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసా గుతోంది. ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరి తల అవర్తనం ఈ రోజు ఇంటీరియర్ ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రబావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నిరంతరం అప్రమత్తం: సీఎస్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివా రం ఆయన విపత్తుల నిర్వహణ శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జతో కలసి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరసగా వస్తున్న రెండురోజుల సెలవులను ఉపయో గించుకోకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎస్ ఆదేశించారు. రెడ్ అలర్ట్ జిల్లాలు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: నల్లగొండ, జనగామ, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ చదవండి: భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక -
భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ శనివారం అత్యవసర సమీక్ష చేపట్టారు. మొన్నటికంటే ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదముందని తెలిపిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోసారి ఎగువనుంచి గోదావరిలోకి భారీ వరద వచ్చే అవకాశం ఉందని, దీంతో గోదావరి పరివాహక జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయమని, కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటిలాగే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎట్లా వస్తున్నాయనే విషయాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే.. లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు. వాతావరణ శాఖ వానలను అంచనా వేస్తుంది. కానీ తద్వారా వచ్చే వరద ముప్పును పసిగట్టలేక పోతుందని, ఈ టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయవచ్చని రజత్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. -
పంటలన్నీ వర్షార్పణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక జిల్లాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. మొలక దశలో ఉండటం వల్ల అనేక పంటలు కొట్టుకుపోగా కొన్నిచోట్ల వాటిపై పూర్తిగా ఇసుక మేటలు వేసింది. మరికొన్నిచోట్ల నీటిలో మొలకలు మురిగిపోయాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే 11 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి నష్టం సంభవించింది. మరోవైపు ఇప్పటికే సాగు దశలో ఉన్న వరితోపాటు మొలక దశలో ఉన్న పత్తి నాశనమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 1,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే అధికారికంగా పూర్తిస్థాయిలో అంచనాలు ఇంకా రూపొందించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ విత్తనాలను వేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులు రూ. వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారం నుంచే రైతులు పత్తి, మొక్కజొన్న విత్తడంతో మళ్లీ నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండోసారి నాటిన రైతులు వానలతో మూడోసారి విత్తనాలను విత్తాల్సిన పరిస్థితి. దీంతో ఖర్చు పెరిగిపోతుందని వాపోతున్నారు. భారీగా పత్తి నష్టం... ఈ సీజన్లో ఇప్పటివరకు పత్తి 38.48 లక్షల ఎకరాల్లో సాగు అయింది. వానలతో సుమారు 8 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి సుమారు రూ. 10 వేల వరకు సరాసరి రైతులు పెట్టుబడిగా పెట్టారు. మొత్తం పత్తి సాగుకు ఎకరానికి రెండు విత్తన ప్యాకెట్ల చొప్పున సుమారు 76.96 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి ప్రకారం పరిశీలిస్తే 8 లక్షల ఎకరాల్లో సుమారు రూ. 800 కోట్ల నష్టం ఒక్క పత్తిలోనే సంభవించిందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వరి, కంది, సోయాబీన్, మొక్కజొన్న పంటలకూ భారీగానే నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సోయాబీన్‌కు అధిక వానలు మరింత నష్టాన్ని కలిగించాయి. వరి చాలా వరకు వరద నీటిలో మునగడంతో ఎర్రబారిపోయింది. కంది, మొక్కజొన్న మొలక దశకు చేరుకున్నప్పటికీ అధిక పదును, వరద నీరు పారడంతో కొట్టుకుపోయింది. ఈ పంటలన్నింటికీ కలిపి సుమారు రూ. 400 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. జిల్లాలవారీగా... నిజామాబాద్ జిల్లాలో 49,591 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 143 గ్రామాల్లో 2,900 మంది రైతులు 5,620 ఎకరాల్లో పంటను నష్టపోయారు. మంచిర్యాల జిల్లాలో 27,592 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 45,420 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1.03 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 29,085 మంది రైతులు నష్టపోయారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 20,293 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మళ్లీ విత్తనాలు వేయాల్సిందే... వర్షాలకు పంటలు దెబ్బతిన్న సుమారు 11 లక్షల ఎకరాల్లోనూ తిరిగి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే రెండోసారి విత్తాల్సి ఉన్నా కొన్నిచోట్ల భూమి అనుకూలిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పంటల వైపు మళ్లాలా లేదా అనేది వ్యవసాయశాఖ అంచనా వేయాల్సి ఉంటుంది. విత్తనాలు సిద్ధంగా ఉంచాం.. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఎక్కడైనా రెండోసారి విత్తాల్సి వస్తే ఆ మేరకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాం. పత్తి, వరి విత్తనాలను ప్రైవేటు కంపెనీలు సిద్ధం చేసినందున ఎక్కడా ఇబ్బంది తలెత్తదు. పంట నష్టం అంచనాపై ఇప్పటివరకు జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కొన్నాళ్లుగా విత్తనాలకు సబ్సిడీ ఇవ్వడంలేదు. కాబట్టి ఈసారి అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. – రఘునందన్‌రావు, కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రభుత్వం ఆదుకోవాలి... మూడెకరాల్లో పత్తి వేశా. విత్తనాలు, దుక్కులు, ఇతరత్రా ఖర్చులకు ఎకరానికి రూ. 30 వేల పెట్టుబడి పెట్టా. గోదావరి బ్యాక్‌వాటర్‌తో ఈసారి పంటంతా నీట మునిగింది. ఇసుక మేటలు వేసింది. పొలంలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో కరెంట్ బంద్ చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలి. – బోగిరి ప్రభాకర్, పోతారం, మంథని నష్టపరిహారం చెల్లించాలి... నాలుగు ఎకరాల్లో పత్తి వేశా. విత్తనాలు, కూలీలకు కలిపి మొత్తం రూ. 30 వేలు ఖర్చయింది. విత్తనాలు మొలకెత్తకముందే వర్షానికి కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలి. పంబలి సాయిలు, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
TS: తక్షణ సాయమందాలి
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని.. ఇందుకోసం పంటలు, ఇళ్లు, ఇతర ఆస్తి నష్టంపై వెంటనే సర్వే నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, చెరువులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ములుగు, ఏటూరునాగారం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి హనుమకొండలోనే బస చేశారు. సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరే ముందు ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. సత్వరమే చర్యలు చేపట్టండి భవిష్యత్‌లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముంపు ప్రమాదం ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఈసారి దెబ్బతిన్న ప్రాంతాల్లో సత్వరమే మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసి, వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను అభినందించారు. పరిస్థితి చక్కబడే వరకు ప్రతీశాఖ అధికారులు 3 షిఫ్టులుగా పనిచేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు, సహాయ కార్యక్రమాలకు అవసరమైన చర్య లు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని.. ఎన్ని నిధులు ఖర్చయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో పరిస్థితి చక్కబడే వరకు మంత్రి సత్యవతి రాథోడ్ ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో అవసరమైన పనులు, సహాయ చర్యలకు ఇన్చార్జులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డాక్టర్ గోపిలను నియమిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్, వెంకటరమణారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డాక్టర్ గోపి, మరికొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వరంగల్‌లో ‘సూపర్ స్పెషాలిటీ’పై ఆరా వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై కేసీఆర్ ఆరా తీశారు. ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి, పరిస్థితిని వివరించాలని మంత్రులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తదితరులు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు.. శనివారం సాయంత్రం రోడ్డుమార్గంలో హనుమకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. సోమవారం అదే రోడ్డుమార్గంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సోమవారం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడిన అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసం నుంచే ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటేయాల్సి ఉన్నందున ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బస్సులో హైదరాబాద్‌కు వచ్చారు. -
Kadem Project: ‘కడెం’ దడ
నిర్మల్/కడెం: మంగళవారం అర్ధరాత్రి.. జోరు వాన.. పెద్ద శబ్ధంతో సైరన్ మొదలైంది. ఇదేమిటని జనం ఇళ్లలోంచి బయటికి వచ్చేప్పటికే డప్పు చాటింపు చప్పుడు.. ‘‘ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఉన్నఫళంగా అందరూ ఇళ్లు వదిలి మన ఊరి బడి కాడికి రావాలహో..’అంటూ వినపడిన చాటింపు అంత వానలోనూ ఊరివాళ్లకు చెమటలు పట్టించింది. వెంటనే ఊరు ఊరంతా అన్నీ వదిలి బయటికి వచ్చేశారు. నిర్మల్ జిల్లా కడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి పరిస్థితి ఇది. ఇక్కడి కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తింది. గేట్లన్నీ ఎత్తివేసినా.. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో అక్కడి నుంచి వాగుల్లో భారీ వరద మొదలైంది. దానికితోడు మంగళవారం సాయంత్రం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కురిసిన వాన నీళ్లూ కడెం వైపు పరుగులు తీస్తూ వచ్చాయి. మహారాష్ట్రలోని వాగుల సమాచారం తెలియకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాల స్థాయి తెలిసే పరిస్థితి లేకపోవడంతో.. అధికారులు భారీ వరదను అంచనా వేయలేకపోయారు. ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అవాక్కయ్యారు. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. అయితే ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తేసినా విడుదలయ్యే నీరు మూడు లక్షల క్యూసెక్కుల లోపే కావడం.. ఇన్‌ఫ్లో మాత్రం ఐదు లక్షల క్యూసెక్కులు ఉండటం.. ఇది 1955లో కట్టిన పాత ప్రాజెక్టు కావడంతో.. అధికారులు అర్ధరాత్రి దాటాక ప్రమాద ఘంటికలు మోగించారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో కడెం పరీవాహక ప్రాంతంలో పంటచేలన్నీ కొట్టుకుపోయాయి. కిలోమీటర్ల పొడవు రోడ్లు తెగిపోయాయి. అర్ధరాత్రి అప్రమత్తమై.. కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి వచ్చిందన్న విషయం తెలియగానే కలెక్టర్ ముషరఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, పలు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రే కలెక్టర్, ఇతర అధికారులు నిర్మల్ నుంచి బయలుదేరారు. ఖానాపూర్ మీదుగా వెళ్లే 61 నంబర్ జాతీయ రహదారి తెగిపోవడంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా చుట్టూ తిరిగి కడెం చేరుకున్నారు. అప్పటికే స్థానిక అధికారులకు సమాచారమిచ్చి.. ప్రాజెక్టు దిగువన ఉన్న కడెం, దస్తురాబాద్ మండలాల్లోని 12 గ్రామాలను ఖాళీ చేయించడం మొదలు పెట్టారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఉదయమే కడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎడమ కాలువకు గండి పడటంతో.. పరిమితికి మించి వచ్చిన వరదతో ప్రాజెక్టు ఎడమ కాల్వ గేట్లపై నుంచి నీళ్లు పొంగి పొర్లాయి. దీనితో బుధవారం మధ్యాహ్నం ఎడమ కాల్వ వద్ద గండిపడి.. నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి. అయితే ఈ గండి వల్లే ప్రాజెక్టుపై భారం తగ్గిందని అధికారులు చెప్తుండగా.. ఆ గండి పెరిగి ప్రమాదకరంగా మారొచ్చన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టిందని, ఇంకా తగ్గితే ప్రమాదం తప్పినట్టేనని కలెక్టర్ ప్రకటించారు. అయితే వానలు పడుతూనే ఉండటం, మరింత పెరగొచ్చనే వాతావరణ శాఖ సూచనలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వ్యక్తమవుతోంది. -
భారీ వర్షాలు.. ప్రజలను హెచ్చరించిన సీఎం కేసీఆర్
-
Telangana Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు..!
-
వరంగల్ జిల్లాలో భారీ వర్షం
-
తెలంగాణలో భారీ వర్షాలు నీట మునిగిన కాలనీలు
-
భారీ వర్షాలు: నేడు తెలంగాణలో సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటం, మరో రెండు రోజు లూ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మంగళవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలపై సమీక్ష సందర్భంగా సెలవు అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రెవెన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలు, ఇతర అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రం విధి నిర్వహణలో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (చదవండి: భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ) పరీక్షలన్నీ వాయిదా.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, వచ్చే రెండు, మూడు రోజుల్లో జరగాల్సిన అన్నిరకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 28, 29 తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు కూడా వాయిదా వేసినట్టు తెలిపారు. ఆయా పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా.. బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో బెస్ట్ పథకానికి మంగళవారం జరగాల్సిన ఇంటర్వ్యూలను బుధవారానికి వాయిదా వేసినట్టు పరిషత్తు అడ్మినిస్ట్రేటర్ కె.చంద్రమోహన్ ప్రకటించారు. (చదవండి: హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం..) -
హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. సుమారు మధ్యాహ్నం 2 గంటల నుంచి మోస్తరు వర్షం, సాయంత్రం 4 గంటల నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉన్న కారణంగా జీహెచ్ఎంసి, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. మరో 12 గంటల పాటు గులాబ్ తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. కరెంట్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ అంతా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు చేరింది. మరో అయిదారు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చీకటి అలుముకుంది. పట్టపగలే కారు చీకటి అలముకుంది. కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హైదరాబాద్ హై అలర్ట్ హైదరాబాదీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ నేడు, రేపు హై అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అవసరమైతే 040-23202813 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. చదవండి: Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. Got to love #HyderabadRain! Yes, it's that dark at 4.15 pm!@Hyderabadrains#HyderabadRains @HiHyderabad @WeAreHyderabad @Rajani_Weather @balaji25_t @HYDmeterologist @Hyderabadiiiiii #HyderabadRains #hyderabad pic.twitter.com/IruTDl8fqp — Aveek Bhowmik (@Aveekishere) September 27, 2021 -
Telangana: నిండుకుండలా చెరువులు
సాక్షి, హైదరాబాద్: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలన్నీ నిండుగా ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని సగానికి పైగా చెరువులు పూర్తిగా నిండి అలుగు దుంకుతున్నాయి. మొత్తం 43,870 చెరువులకు గాను 27 వేల చెరువులు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నాయి. మరో 6,243 వేలకు పైగా ఏ క్షణమైనా నిండి పొంగిపొర్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లంతా స్థానికంగానే ఉండి ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలుగు దుంకుతున్నాయి.. ప్రస్తుతం కరీంనగర్, గజ్వేల్, ఖమ్మం, వరంగల్ డివిజన్ల పరిధిలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. కరీంనగర్ డివిజన్లో 2,889 చెరువులకు గానూ 1,500, వరంగల్ జిల్లాలో 2,946 చెరువులకు 1,720 చెరువులు నిండిపోయాయి. ఖమ్మంలో 1,409 చెరువులకు గానూ ఏకంగా 1,400 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గజ్వేల్ డివిజన్లోని 6,308 చెరువుల్లో 4 వేల చెరువులు నిండాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 1,246 చెరువుల్లో మూడు, నాలుగు చెరువులు మినహా మిగతా చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి. కృష్ణా బేసిన్లో సూర్యాపేట జిల్లాలో 1,314 చెరువుల్లో 985 చెరువులు, నల్లగొండలోని 1,927 చెరువుల్లో 800 చెరువులు నిండినట్లు సాగునీటి శాఖ రికార్డులు చెబుతున్నాయి. చెరువుల కట్టలు తెగకుండా రెవెన్యూ, మున్సిపల్, వాతావరణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం 12 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం నిండేందుకు సిద్ధంగా నిజాంసాగర్, సింగూరు ప్రస్తుత వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండుకోగా, సింగూరు, నిజాంసాగర్‌లు కూడా నిండే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిజాంసాగర్‌కు స్థానిక వాగుల నుంచి 26,823 క్యూసెక్కుల మేర వరద కొనసాగుతుండగా, పూర్తిస్థాయి నిల్వ 17.80 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 12.93 టీఎంసీలకు చేరింది. ఇక సింగూరుకు 23,646 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో ఈ ప్రవాహాలు మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. శ్రీరాంసాగర్‌కు 24,510 క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదవుతుండగా, 44,940 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీనితో ఎల్లంపల్లికి 86 వేల క్యూసెక్కులు, లోయర్ మానేరుకు 58 వేల క్యూసెక్కుల మేర వరద నమోదవుతోంది. -
Telangana: దంచికొట్టిన వాన
మెదక్ జిల్లా చేగుంటలో అత్యధికంగా 21.7 సెంటీమీటర్లు, మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వాన కురిసింది. చాలా ప్రాంతాల్లో పది, పదిహేను సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. పెద్ద సంఖ్యలో కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఐదు జిల్లాల్లో అప్రమత్తం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడే అవకాశం ఉందని.. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల కింద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోపాటు ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 36.9 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.67 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా హైదరాబాద్‌లో 8.17 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది. జిల్లాల్లో వానలే వానలు.. యాదాద్రి జిల్లాలో బుధవారం రాత్రంతా కుండపోత వాన పడింది. 25 చెరువులు అలుగు పోస్తున్నాయి. బిక్కేరు వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,000 ఎకరాల్లో వరి నీటమునిగింది. పత్తి చేలలో నీరు నిలిచింది. మూసీ కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు. జనగామ జిల్లాలో భారీ వర్షంతో బచ్చన్నపేట- నక్కవానిగూడెం శివారు, జనగామ మండలం గానుగుపహాడ్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. నల్లచెరువు, వెల్దండ, గండిరామారం, తాటికొండ వల్లభరాయ్, ఛాగల్ మర్రికుంట చెరు వులు మత్తడి పోస్తున్నాయి. రోడ్లపై నీటి వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వీర్నపల్లి మండలంలోని గిరిజన తండాల్లో వాననీరు ఇళ్లలోకి చేరింది. పత్తి చేన్లు మునిగాయి. నక్కవాగు, సుద్దవాగు, బిక్కవాగు, గంజివాగు, సండ్రవాగులు పొంగిపొర్లుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుద్రంగి మండలంలో గొర్రెగుండం జలపాతం దూకుతోంది. వికారాబాద్ జిల్లాలో వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. పరిగి, వికారాబాద్, తాండూర్ పట్టణాల్లోని పలు కాలనీల్లో నీళ్లు చేరాయి. ధారూర్ మండలం రాళ్లచిట్టంపల్లిలో ఇల్లు కూలి షబ్బీర్ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. మోమిన్‌పేట మండలం గోవిందాపూర్‌కు చెందిన బుడ్డమ్మ ఆసరా పింఛన్ తీసుకొని వస్తుండగా మల్లారెడ్డిగూడెం సమీపంలోని వాగు దాటుతూ కొట్టుకుపోయింది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌లో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చిక్కుకుని.. సురక్షితంగా బయటపడి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం–ఎఖీన్‌పూర్ గ్రామాల మధ్య వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా.. పోలీసులు ఫైర్ రెస్క్యూ టీం, గ్రామస్తులతో కలిసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తెగిన చెరువు కట్ట భారీవర్షంతో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చెరువు కట్ట తెగిపోవడంతో పెద్దవాగు పొంగిపొర్లింది. సాతారంలో శివార్లలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఏడుగురు, వేంపల్లిలో మరొకరు వాగులో చిక్కుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు గజ ఈతగాళ్లు, తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. -
కుండపోత వాన.. పరవళ్లు తొక్కుతున్న కుంటాల జలపాతం
జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరదనీరు వచ్చిచేరింది. దీంతోప్రాజెక్టుల్లో నీటిమట్టాలు, నీటి సామర్థ్యం పూర్తిస్థాయికి దరిదాపులోకి వచ్చాయి. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగ నదిలో ఎగువ మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, బోథ్, ఇచ్చోడ, గాదిగూడ, ఉట్నూర్‌లలో భారీగా వర్షం కురువగా, మిగితా మండలాల్లో ఓ మోస్తారు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు 18 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పెన్‌గంగ నది లో ఎగువ మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం అధి కంగా ఉంది. జిల్లాలోని జైనథ్ మండలం కొరటా, మహారాష్ట్రలోని చనాకా మధ్యన నది వద్ద నిర్మించిన బ్యారేజీ 23 గేట్ల నుంచి ఈ వరద దిగువకు ప్రవహిస్తుంది. జూన్ 1 నుంచి ఈ బ్యారేజీ గేట్లను దాటి 26.89 టీఎంసీల వరదనీరు దిగువకు వెళ్లిపోయింది. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టుకు ఈ వర్షాకాలంలో 0.77 టీఎంసీల నీరు వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో 2 మీటర్ల దూరంలో ఉంది. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు ఇప్పటివరకు 0.29 టీఎంసీల వరద నీరు రావడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి ఒక మీటర్ దిగువలో ఉంది. వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలాల్సి వస్తుంది. సాత్నాల ప్రాజెక్టుకు 4 గేట్లు, మత్తడివాగు ప్రాజెక్టుకు 5 గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద సాత్నాలకు 24వేల ఎకరాలు, మత్తడివాగు ప్రాజెక్టుకు 8500 ఎకరాల ఆయకట్టు ఉంది. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు -
అందరినీ ఆదుకుంటాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘వరంగల్ నగరంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుంది. నగరంలో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకు ఆదేశించాం. సీఎంకు పరిస్థితి వివరించడంతో రూ.25 కోట్లు తక్షణ సహాయం కింద మంజూరు చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలి’అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు ముంపునకు గురైన వరంగల్ నగరంలో మంగళవారం పర్యటించారు. కేటీఆర్, ఈటల ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు హెలికాప్టర్లో చేరుకున్నారు. అనంతరం కేటీఆర్ నాయకత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని నయీంనగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ–యూనివర్సిటీ రోడ్, పోతననగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 4 గంటల పాటు పర్యటించారు. అన్ని ప్రాంతాల్లోని ముంపునకు గురైన ప్రజలతో మాట్లాడి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. దెబ్బతిన్న డ్రైనేజీలు, ఇళ్లు, రోడ్లను పరిశీలించారు. ఫాతిమానగర్–కేయూ వంద ఫీట్ల రోడ్డులో గోపాలపూర్, సమ్మయ్య నగర్ ప్రాంత వాసులతో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని.. పరిస్థితి చక్కబడే వరకు నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. హంటర్ రోడ్డులో కేటీఆర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు వరద నీటిలోనే నడుస్తూ పరిస్థితులు పరిశీలించారు. చాలా చోట్ల నాలాలపై ఆక్రమణ వల్లే వరదలు సంభవించినట్లు స్థానికులు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సభ్యులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం వరంగల్ జిల్లా హన్మకొండ అమరావతినగర్ వాసులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు వరంగల్ ఎంజీఎం కోవిడ్ వార్డు సందర్శన.. ముంపు ప్రాంతాల పర్యటన అనంతరం ఈ బృందం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్ వార్డును సందర్శించింది. మంత్రులు కేటీఆర్, ఈటల, ఎర్రబెల్లి పీపీఈ కిట్లు ధరించి కోవిడ్ వార్డులోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్యంపై ఆరా తీశారు. మందులు, పరికరాలతోపాటు నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. ఆక్రమణలపై సీరియస్.. ఏరియల్ వ్యూ ద్వారా ఓరుగల్లు నగరాన్ని పరిశీలించిన కేటీఆర్.. అనంతరం కాజీపేటలోని ‘నిట్’ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మా ట్లాడుతూ.. ‘ముంపు కాలనీల పర్యటనలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విష యం చెప్పారు. నాలాలపై ఆక్రమణల వల్ల వ రద బయటకు వెళ్లపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చి జనావాసాలు జలమయమయ్యాయన్నారు. వారు చెప్పింది నిజం. నగరంలో అనే క చోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయి. వాటి ని తక్షణం తొలగించాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పని వెంటనే ప్రారంభం కావాలి. ఆక్రమణల గుర్తింపు, తొలగింపునకు కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తున్నాం. నాలాలపై అక్రమ నిర్మాణాలు వేటిని విడిచిపెట్టొద్దు. ఒకవేళ వాటిల్లో పేదల ఇళ్లుంటే, వారికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఉన్న వారివైతే నష్ట పరిహారం చెల్లించి తొలగించాలి’అని ఆదేశించారు. ( రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా ) పీపీఈ కిట్లు ధరించి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతున్న మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ కలెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వరంగల్‌లో రాబోయే నెల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని కేటీఆర్ ప్రకటించారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కలెక్టర్ రాజీవ్ హన్మంతు చైర్మన్‌గా, పోలీస్ కమిషనర్ కో చైర్మన్‌గా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జల వనరుల శాఖ ఎస్ఈ, వరంగల్ అర్బన్ ఆర్డీఓ, నేషనల్ హైవేస్ అథారిటీ ఎస్ఈ సభ్యులుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. వరంగల్‌లో నాలాలపై ఆక్రమణలు ఇప్పుడు వచ్చినవి కాదని.. చాలా ఏళ్ల క్రితం నుంచే ఇదంతా జరిగిందన్నారు. ఓ పద్ధతి ప్రకారం నగరాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చామని చెప్పారు. వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైందని, సీఎం ఆమోదంతో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ‘ఈ రెండింటితో పాటు కొత్తగా టీఎస్ బీ పాస్ కూడా వచ్చింది. ఈ చట్టాలు, విధానాలు, ప్రణాళికలకు అనుగుణంగా వరంగల్‌లో ఇకపై నిర్మాణాలుండాలి. ఆ మేరకు అభివృద్ధి కావాలి’అని కేటీఆర్ వివరించారు. వరంగల్‌పై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ వరంగల్ నగరంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘వరంగల్‌లో భారీ వర్షాలు, వరదలు అనే సమాచారం సీఎంకు ఎంతో ఆందోళన కలిగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఏ మాత్రం ప్రాణనష్టం కలగకుండా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మార్గనిర్దేశం చేశారు. సీఎం సోమవారం స్వయంగా వరంగల్ రావాలనుకున్నారు. కానీ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే మానుకున్నారు. మమ్మల్ని ప్రత్యేకంగా పంపించారు. ఇక్కడి పరిస్థితిని చూసి, సీఎంకు నివేదించాం. తక్షణ అవసరాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేసిన సీఎం.. నష్టంపై అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తామని చెప్పారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ నగర జనాభా ఇప్పటికే 11 లక్షలకు చేరిందని, దీనికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ‘పారిశుద్ధ్య పనుల్లో యాంత్రీకరణ జరగాలి. ముంపునకు గురైన వారికి ప్రభుత్వం పక్షానే నిత్యావసర సరుకులు అందించాలి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి. అలాగే రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’అని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తుజా రిజ్వీ, డీహెచ్ఈ రమేశ్ రెడ్డి, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కలెక్టర్ రాజీవ్ హన్మంతు, పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కుడా చైర్ పర్సన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరదలపై పాలసీ
సాక్షి, హైదరాబాద్: వానలు, వరదలు సంభ విస్తే అనుసరించాల్సిన ప్రణాళికను గత పాల కులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రూపొందించి తెలంగాణను పట్టించు కోలేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తెలంగాణలో వానలు, వరదలు, విపత్తులు వచ్చినా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విప త్తుల నిర్వహణ వ్యూహాన్ని తయారు చేసుకోవా లన్నారు. ‘ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ’ పేరిట తయారయ్యే ఈ పాలసీ శాశ్వత ప్రాతిపదికన ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వరదల మూలంగా తలెత్తిన పరిస్థితిపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కె. తారక రామారావు, నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఉగ్ర గోదావరి..) మరో 3, 4 రోజులు కీలకం... ‘నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండటంతోపాటు వాగులు, వంకలు, నదులు పొంగుతున్నాయి. ప్రస్తుతం పరిస్తితి అదుపులో ఉన్నా మరో మూడు నాలుగు రోజులు అత్యంత కీలకం. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికితోడు ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. (ఇంకా వరద బురదలోనే..) ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకొని నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలి. కంట్రోల్ రూమ్‌లలో రెవెన్యూ, పోలీస్, జలవనరులు, విద్యుత్ తదితర శాఖల ప్రతినిధులుండాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నందున ఖర్చుకు వెనకాడకుండా పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అని కేసీఆర్ ఆదేశించారు. జిల్లాలవారీగా పరిస్థితిపై ఆరా.. జిల్లాలవారీగా వర్షాల పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘గోదావరికి భారీ వరద వచ్చే అవకాశం ఉన్నందున ఏటూరునాగారం, మంగపేట మండలాలతోపాటు పరీవాహక ప్రాంతంలోని ముంపు గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భద్రాచలం పట్టణంలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టలు పటిష్టంగా తయారు కావడంతో నిలువ సామర్థ్యం పెరగడంతో బుంగలు పడకుండా నివారించగలిగాం. ఇంకా పనులు చేపట్టని కొన్ని చిన్న కుంటలకే నష్టం జరిగింది. చెరువులకు మరింత వరద వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి’ అని సీఎం సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు.. ‘విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడటమే అత్యంత ముఖ్యమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. ముంపు ప్రమాదంపై అధికార యంత్రాంగానికి ప్రజలు సమాచారం ఇవ్వాలి. కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లు, కాజ్‌వేల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి భోజనం, ఇతర వసతులు, కోవిడ్ రక్షణకు మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానికంగా ఉంటూ సహాయ చర్యలు పర్యక్షించాలి. వానలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేయాలి. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు పట్టణాలు, గ్రామాల నుంచి నివేదికలు తెప్పించుకొని నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం ‘భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాన్ని అధికార యంత్రాంగం రూపొందించుకోవాలి. ఏ స్థాయిలో వర్షం వస్తే ఎక్కడ ఎంత నీరు వస్తుంది? ఏ నదికి ఎంత వరద వస్తుంది? అప్పుడు ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది వంటి అంశాలను అధ్యయనం చేయాలి. భారీ వర్షాలు పడినా లోతట్టు ప్రాంతాలను ఎలా కాపాడాలి? ఎక్కడెక్కడ రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఉంది వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వ్యూహం ఖరారు చేయాలి. అన్ని పట్టణాల్లో మున్సిపల్, పోలీసు విభాగాలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి వెంటనే రంగంలోకి దిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్‌షీట్ తయారు చేసి నదులు పొంగినప్పుడు తలెత్తే పరిస్థితులను నమోదు చేయడంతోపాటు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులతోపాటు ఇతర వ్యా«ధులపై వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యుత్ సిబ్బందికి అభినందన... ప్రకృతి విపత్తు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడటంతోపాటు గ్రిడ్ ఫెయిల్ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్ సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. ‘ఉమ్మడి ఏపీలోనూ లేని రీతిలో ఈ ఏడాది తెలంగాణలో 13,168 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే ఏడాది ఓ సందర్భంలో 4,200 మెగావాట్ల అత్యంత కనిష్టానికి కూడా విద్యుత్ డిమాండ్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రిడ్ కుప్పకూలకుండా తెలంగాణ విద్యుత్ సంస్థలు పనిచేశాయి’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ శాఖ సైతం హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారీ నష్టం కలగకుండా చర్యలు తీసుకుందన్నారు. -
ఇంకా వరద బురదలోనే వరంగల్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ మహానగరం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ఎటు చూసిన బురదమయమైన కాలనీలు, దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, సాయం కోసం బాధితుల ఆక్రందనలు.. ఇలా ఒకటేమిటి.. అనేక సమస్యలతో జనజీవనం అతలాకుతలమైంది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు వరంగల్ మహానగరాన్ని ముంచెత్తిన విషయం విదితమే. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీస్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలే కాకుండా ఈసారి ప్రధాన కాలనీలు కూడా ఇంకా జల దిగ్భంధం నుంచి బయట పడలేదంటే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గంట గంటకూ సమీక్షిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. (7 నుంచి అసెంబ్లీ.. ) సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వరద నీటిలో చిక్కుకు పోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 4,116 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించాయి. అయితే వరద సహాయక చర్యల్లో భాగంగా పడవలను ఉపయోగించడం నగర చరిత్రలో ఇదే మొదటి సారి కాగా, హంటర్ రోడ్డు, సాయినగర్ కాలనీ, సంతోషిమాత, కాలనీ, సరస్వతీ నగర్, నయీంనగర్, ములుగు రోడ్డు, హంటర్ రోడ్డు, అండర్ రైల్వే గేటు, దేశాయిపేట, నజరత్ పురం, వడ్డెపల్లి కాలనీ, కేయూ 100 ఫీట్ల రోడ్డు, తదితర ప్రాంతాలు వరద తాకిడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కమిషనర్ పమేలా సత్పతి నగరంలో పర్యటించి పలు కాలనీలు, ముంపు ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు భరోసా ఇచ్చారు. కదిలిస్తే కన్నీళ్లు పోటెత్తిన వరద లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీరని వేదన మిగిల్చింది. సోమవారం వరుణుడు కరుణించినప్పటికి జనజీవనం గాడిన పడలేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటిలో మగ్గుతున్నారు. నిత్యావసర వస్తువులు తడిసిపోయి, విష సర్పాల నడుమ అర్ధాకలితో అలమటిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పాలక, అధికార వర్గాలు అందిస్తున్న సహాయక చర్యలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. ఇళ్ల చూట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక అవస్థలు పడ్డారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వల్ల మురుగు కాల్వలు పొంగి పొర్లాయి. ప్రధానమైన నాలాలు ద్వారా ఆ వరద నీరు వెళ్లకపోగా నేరుగా కాలనీల్లోకి ప్రవేశించాయి. ఇంకా ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండ హంటర్ రోడ్డులో ఎటు చూసినా వరద నీరు నిలిచి ఉన్నాయి. బొందివాగు నాలా నీరు సవ్యంగా వెళ్లకపోవడంతో సమీపంలోని ఉన్న కాలనీలను వరద ముంచెత్తింది. దీంతో హంటర్ రోడ్డుకు సమీపంలో ఉన్న సాయినగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, ఎన్టీర్ నగర్, గాయిత్రీ నగర్, భద్రకాళి నగర్, రామన్నపేట రోడ్డు కాలనీల్లో ఉన్న ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో జనం జలం మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హన్మకొండ ప్రాంతంలోని నయీం నగర్ పోచమ్మకుంట వరకు ఉన్న నాలాల ద్వారా నీళ్లు వెళ్లడం లేదు. ప్రైవేట్ ఖాళీ స్థలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి గోదావరి, ఇంద్రావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపునకు లోనయ్యే ఇళ్ల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ములుగు మండలం బండారుపల్లి గ్రామము వద్ద రాళ్లవాగులో ఆర్టీసీ బస్సు, అందులోని ప్రయాణికులు చిక్కుకోగా..పోలీసులు వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గం మోరంచ వాగులో బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్యూ టీంను రంగంలోకి దించగా ఒడ్డుకు చేర్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆపన్న హస్తం అందించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మోదుగుగడ్డ తండాకు చెందిన ముగ్గురు రైతులు వ్యవసాయ పనులు నిమిత్తం ఆకెరువాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయి చెట్టుని పట్టుకొని సహాయం కోసం ఎదురు చూశారు. తండావాసులు వారిని ఒడ్డున చేర్చారు. మంగళవారం మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హన్మకొండలో దేశంలోనే అత్యధిక వర్షపాతం వరంగల్ అర్బన్ : దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన పది నగరాల్లో హన్మకొండ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. హన్మకొండలో 212 మి.మీ. వర్షపాతం నమోదు కాగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మహారాష్ట్రలోని మహబలేశ్వరంలో 155 మి.మీ., మూడో స్థానంలో మధ్యప్రదేశ్‌లోని ఉమరిలో 153 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా, వర్షం భారీగా కాకుండా ఐదు రోజుల పాటు ఓ మోస్తరు, ముసురు రూపంలో కురవడంతో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని, అలా కాకుండా భారీ వర్షం కురిస్తే జలప్రళయం ఏర్పడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయింది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. (సైదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదం) జిల్లాలవారిగా వర్షాభావ పరిస్థితులను కేసీఆర్ సమీక్షించారు. పంట, ఇతర నష్టాలపై వివరాలు పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది. (11 రాష్టాల్లో వరదలు.. 868 మంది మృతి) సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. 20 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయన్నారు. అసెంబ్లీలో చాలా అంశాలపై చర్చించాలని, కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్‌ను ముంచెత్తిన వానలు అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు వరంగల్ నగరాన్ని ముంచెతుతున్నాయి. స్థానిక పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉదయం హెలికాప్టర్లో వరంగల్ వెళ్లనున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలవనున్నారు. మంత్రుల బృందం నగరంలో పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. వరంగల్ ఎంజిఎంను సందర్శించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తారు. వానలు, వరదలు, కరోనా పరిస్థితిని, తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. -
నేడు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు..
సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 3.6 కి.మీ.నుంచి 4.5 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. బుధ వారం ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం–ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరి సిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగు ళాంబ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు : మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ములుగులో 9.5, గోవిందరావుపేటలో 9, మంచిర్యాలలోని భీమినిలో 8.5, భోరజ్ల, గూడూరు, మంచిర్యాలలోని కొండాపూర్‌లో 8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
కుండపోత.. గుండెకోత
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్) : మండలంలోని కందుగుల గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నేదురు చంద్రమౌళి. ఇతనికి మూడున్నర ఎకరాల భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేశాడు. ఇప్పటికే సుమారుగా ఎకరాకు రూ.25 వేల చొప్పున ఖర్చు చేశాడు. ఖరీఫ్ సీజన్లో ఆఖరికి కాలం కావడంతో తీవ్ర కష్టాలకోర్చి సాగు చేశాడు. మరో రెండు రోజుల్లో వరి కోసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శుక్ర, శనివారం కురిసిన వర్షంతో వరి మొత్తం నేలవాలింది. కోయరాకుండా పొలం అంతా నీటితో నిండింది.’ ఇది ఒక్క చంద్రమౌళి పరిస్థితి కాదు జిల్లాలోని రైతులందరూ వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలు అన్నదాతకు గుండెకోత మిగను మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి అన్నదాత కుదేలవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి సాగుచేసి పంట చేతికొచ్చేవేల నేలపాలు కావడంతో దిక్కుతోచరి స్థితిలో పడ్డారు. మూడేళ్లుగా వరుణుడు తమను పగబడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 13 మండలాల్లో అత్యధిక వర్షపాతం... ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు కురువక పంటల సాగు ఆలస్యమైంది. సీజన్ ముగింపుదశలో కురుస్తున్న అకాల వర్షాలతో చెరువులు, కుంటలన్ని నిండి జలకళను సంతరించకున్నాయి. ఈ నెలలో తొమ్మిది రోజుల్లో రికార్డుస్ధాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని రామడుగు, శంకరపట్నం, మానకొండూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 13 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. శనివారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు నీటమునిగాయి. ప్రధానంగా శంకరపట్నం, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరిపంటకు ఎక్కువగా నష్టం జరిగింది. సైదాపూర్ మండలంలో అత్యధికంగా 103.2మి.మీ, జమ్మికుంటలో 80.2, వీణవంకలో 70.2, చిగురుమామిడిలో 65.6మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 45.5 మిమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మికుంట మండలంలో వాలిన పొలాన్ని చూపుతున్న రైతులు 4,627 హెక్టార్లలో వరి పంట నష్టం.. జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 52 వేల హెక్టార్లు కాగా, ఈ ఖరీఫ్‌లో 79,327 హెక్టార్లు సాగైంది. 4.25 లక్షల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 119 గ్రామాల్లో 6,298 రైతులకు చెందిన 4,627 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని రైతులు పేర్కొంటున్నారు. దెబ్బతిన్న పంటలను ఆదివారం ఏవోలు, ఏఈవోలు గ్రామాలవారీగా సర్వే చేసి వివరాలను సేకరిస్తున్నారు. దూది రైతుకు దుఃఖం.. పత్తి రైతుకు మళ్లీ కష్టమొచ్చింది. అవసరం లేని సమయంలో కురుస్తున్న వర్షం తీరని నష్టాల్ని మిగిలిస్తుంది. ప్రస్తుతం పత్తి పంట కాయ దశకు రాగా, కొన్ని ఏరియాల్లో మొదటి సారి ఏరుతున్నారు. ఎకరాలకు కనీసం పది క్వింటా ళ్లు రావాల్సిన దిగుబడి పంట కీలక సమ యం లో అకాల వర్షాలతో నష్టం వాటిల్లి ఆశించిన మేరకు దిగుబడి రాకపోగా, పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పత్తి సాధారణ విసీ ్తర్ణం 42,918 హెక్టార్లు కాగా, ఈసారి 36,762 హెక్టార్లు సాగైంది. హెక్టారుకు కనీసం 14 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచ నా వేశారు అధికారులు. అయితే అకాల వర్షాలతో ఆశించిన మేరకు దిగుబడి వచ్చే పరి స్థితి కనిపించడం లేదు. వానలతో పత్తి కాయ నల్లబడగా, పలిగే దశలో ఉన్న కాయ మురిగిపోయే పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. -
వీడని వాన
సాక్షి, ఆదిలాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన జిల్లాలో వాన విరామం లేకుండా కురుస్తూనే ఉంది. తేరుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో సహాయక, రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం రాత్రి నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా ముసురు కొనసాగుతోంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. డయేరియాతో ఒకరు, జ్వరంతో మరొకరు మృత్యువాతపడ్డారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిరాశ్రయులకు ఆపన్నహస్తం, సహాయం అందజేస్తున్నారు. 29.8 మిల్లీమీటర్ల వర్షం..జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 29.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉట్నూర్‌లో 60 మిల్లీమీటర్లు, ఇంద్రవెల్లిలో 57.2, గుడిహత్నూర్ 45.6, సిరికొండలో 35.8, బేలలో 33.8, ఆదిలాబాద్‌రూరల్ 33.5, నార్నూర్‌లో 30.2, జైనథ్‌లో 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉట్నూర్‌లో భారీ వర్షం కురువడంతో లక్కారం చెరువు పొంగి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని గ్రామంలోకి వరదనీరు చుట్టుముట్టింది. ఉట్నూర్ మండలకేంద్రంలోని శాంతినగర్‌లో భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరింది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డిలు ఈ గ్రామాలను సందర్శించారు. వరద ముంపు బాధితులకు ఉట్నూర్ బీసీ హాస్టల్లో పునరావాసం కల్పించారు. ఇంద్రవెల్లి మండలం జైత్రంతాండ, మామిడిగూడ, జెండాగూడాల్లో వాగులు ఉప్పొంగడంతో గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. బేల మండలం దహెగాం బ్రిడ్జికి గుంత పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు ఏడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగాయి. గణేష్‌పూర్ బ్రిడ్జిపై గుంత పడడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కృష్ణవేణి(4) డయేరియాతో మృతిచెందింది. ఇంద్రవెల్లి మండలంలోని బుద్ధనగర్‌కు చెందిన సోన్కాంబ్లే సక్కుబాయి(65) జ్వరంతో చనిపోయింది. భారీ వర్షాలకు ఈమె ఇంట్లోకి వరదనీరు చేరడంతో బాధితురాలు అస్వస్థతకు గురై మృత్యువాతపడింది. ఈ రెండు సంఘటనలు జిల్లాలో వరద ముప్పు కారణంగా ప్రబలే వ్యాధులకు సంకేతంగా నిలుస్తున్నాయి. కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు.. ఆదిలాబాద్, బేల, గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్హత్నూర్, సిరికొండ, ఇంద్రవెల్లిలలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది వరద బాధితులు తలదాచుకుంటున్నారు. బాధితుల సహాయార్థం పలువురు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కలెక్టర్ పిలుపు మేరకు పలు జిల్లాల నుంచి వివిధ నిత్యావసర సామగ్రితోపాటు బాధితులకు నగదు అందజేస్తున్నారు. పోలీసు శాఖ నుంచి రూ.4లక్షల విరాళం అందజేశారు. త్వరలో కలెక్టర్‌కు ఈ నగదును అందజేయనున్నట్లు ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. పలువురు స్వచ్ఛంద సంఘాలు వరదబాధితుల సహాయార్థం చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల.. వర్షాలతో జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు మళ్లీ క్రమంగా నిండుతోంది. ఇటీవల భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టు నిండినప్పటికీ గేట్లను సరైన సమయంలో మూయకపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా దిగువకు వెళ్లిపోయింది. కాగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మళ్లీ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. సాత్నాల ప్రాజెక్టు నీటిమట్టం 286.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 285 మీటర్లకు చేరుకుంది. నీటి సామర్థ్యం 1.240 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.932 టీఎంసీలకు చేరింది. సోమవారం ఉదయం ఇన్‌ఫ్లో 13500 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 21వేల క్యూసెక్కులు ఉంది. సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4800 క్యూసెక్కులకు చేరింది. మత్తడివాగు 277.5 మీటర్లు నీటిమట్టం కాగా, ప్రస్తుతం 276.5కు చేరుకుంది. నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.457కు చేరుకుంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 580 ఉంది. కాగా సాత్నాల ప్రాజెక్టును ఎన్డీఆర్ఎఫ్ బృందం పరిశీలించింది. సోమవారం వేకువజామున భారీ వర్షం నమోదు కావడం, సాత్నాలకు ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో అప్రమత్తమైన ఈ బృందం అక్కడికి చేరుకుంది. ప్రాజెక్టులో నీటి పరిస్థితులను గమనించారు. జనరేటర్ గదులను పరిశీలించారు.