సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారి కోస్తా, ఒడిశా దాని పరిసర ప్రాంతాలలో భువనేశ్వర్‌కి తూర్పు ఆగ్నేయ దిశగా 30కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ కారణంగా గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మెదక్, సిద్దిపేట, వరంగల్, మహ బూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో సారంగపూర్ (జగిత్యాల) 2 సెంటీమీటర్లు, తాడ్వాయి (కామారెడ్డి) 2 సెంటీమీటర్లు, నవీపేట్ (నిజామాబాద్) 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment