మూడ్రోజులు మోస్తరు వర్షాలు | Moderate rains for three days | Sakshi
Sakshi News home page

మూడ్రోజులు మోస్తరు వర్షాలు

Published Sat, Aug 11 2018 2:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:02 PM

Moderate rains for three days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, గత 24 గంటల్లో గోల్కొండ, హయత్‌నగర్‌ 6 సెం.మీ, సరూర్‌నగర్, మంచల్‌ (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి) 4 సెం.మీ, హైదరాబాద్, బొనకల్‌ (ఖమ్మం), నల్లగొండ, మొగుళ్లపల్లి (జయశంకర్‌ భూపాలపల్లి) 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement