
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: వర్ని (నిజామాబాద్) 6 సెం.మీ., కోటగిరి (నిజామాబాద్) 5 సెం.మీ., బెజ్జూరు (కొమురం భీం) 4 సెం.మీ., గాంధారి (కామారెడ్డి) 4 సెం.మీ., జుక్కల్ (కామారెడ్డి) 3 సెం.మీ., లింగంపేట్(కామారెడ్డి) 3 సెం.మీ., మద్నూర్ (కామారెడ్డి) 3 సెం.మీ., నిజామాబాద్ 3 సెం.మీ, అశ్వారావుపేట్‌లలో (భద్రాద్రి కొత్తగూడెం) 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.