సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 3.6 కి.మీ.నుంచి 4.5 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. బుధ వారం ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం–ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరి సిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగు ళాంబ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
భారీ వర్షాలు : మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ములుగులో 9.5, గోవిందరావుపేటలో 9, మంచిర్యాలలోని భీమినిలో 8.5, భోరజ్‌ల, గూడూరు, మంచిర్యాలలోని కొండాపూర్‌లో 8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment