metrological department
-
వణికిస్తున్న ఫెంగల్ తుఫాను
-
గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. 20 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మోర్బీలో ఒకరు, గాంధీనగర్‌లో ఇద్దరు, ఆనంద్‌లో ఆరుగురు, వడోదరలో ఒకరు, ఖేదాలో ఒకరు, మహిసాగర్‌లో ఇద్దరు, ఒకరు మరణించారు. భరూచ్‌లో మరణించగా, అహ్మదాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 23,870 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 1,696 మందిని రక్షించారు. అయితే మంగళవారం వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణవాఖ గుజరాత్‌కు హచ్చరికలు జారీ చేసింది.#HeavyRainfallअगर बहुत जरूरी ना हो तो इस समय गुजरात घूमने से बचे,बारिश ने कहर मचाया हुआ है। खासकर अहमदाबाद,वडोदरा में भयंकर बारिश है।प्रभु धीर धरो..बाढ़ के हालात हैं #GujaratFlood #HeavyRain #GujaratRains #vadodararain #HeavyRainAlert #Gujarat #Ahmedabad #AhmedabadRains pic.twitter.com/5ddCzz6SdU— Monu kumar (@ganga_wasi) August 28, 2024 రెస్క్యూ. రిలీఫ్ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి , గుజరాత్ ప్రభుత్వం ఆరు ఇండియన్ ఆర్మీ బృందాల సాయం కోరింది దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో సైన్యం, 14 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వర్షాల ధాటికి సురేందర్‌నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయింది. వర్షాల పరిస్థితి, సహాయక చర్యలను సమీక్షించేందకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న నదులు, డ్రెయిన్లు, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసుల సహకారం తీసుకుని పూర్తి అప్రమత్తతతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంతే కాకుండా వాతావరణ శాఖ ప్రత్యేకంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదనే హెచ్చరికను కచ్చితంగా పాటించాలని తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.गुजरात में भारी बारिश से जनजीवन अस्त व्यस्त.. कृपया इस मौसम में सावधानी बरतेंसावधान रहें.! सुरक्षित रहे.!!#HeavyRainfall #GujaratRains #HeavyRainAlert pic.twitter.com/n9Qlh9pmPy— Mukesh Jeetrawal (@MukeshJeetrawal) August 28, 2024 ఇక గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి మట్టం పెరిగి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరత్, వడోదర నగరాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. రాజధాని గాంధీనగర్లోనూ రోడ్లపైకి నీరు చేరింది. వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలో ఏడు వంతెనలను మూసివేశారు. నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. డైమండ్ సిటీ సూరత్‌లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. -
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం వాయవ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇప్పటికే కోస్తాంధ్రలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో శనివారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం సాయంత్రానికి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజుల పాటు వర్షాలకు కొంత విరామం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 20 వరకు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. విద్యాసంస్థలకు సెలవు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా శనివారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. -
ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంపైన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలో సగటున 1.85 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో సగటున 4.39 సెం.మీ. వర్షం కురవగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.33 సెం.మీ. వికారాబాద్ జిల్లాల్లో 4.16 సెం.మీ., మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4.04 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. -
మూడు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణ స్థితిలో నమోదైనప్పటికీ.. కొన్ని జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉంది. ఈ మూడు రోజుల పాటు వర్షాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 13.07 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రంలో నైరుతి సీజన్లో జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఈ నెలలో గురువారం నాటికి నమోదు కావాల్సిన సగటు వర్షపాతం 11.14 సెంటీమీటర్లు కాగా.. 13.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, మూడు జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు చెపుతున్నాయి. సాగు పనులు ముందుకెళ్లాలంటే ఈ వారం వర్షాలే కీలకం కానున్నాయి. సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
‘నైరుతి’ వచ్చేసింది
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/యడ్లపాడు/: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించాయి. ఇవి శనివారం రాత్రి రాయలసీమను తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో అవి రాష్ట్రమంతా శరవేగంగా విస్తరించే అవకాశమున్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా రుతు పవనాలు ఐదో తేదీ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ముందుగానే ప్రవేశించాయి. దీంతో రాయలసీమలోని అనంతపురం, అనంతరం నెల్లూరు జిల్లాను తాకడంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.ఇవి ఒకట్రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు దూకుడుగా ఉన్నందున రెండు మూడ్రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అలాగే, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లోకి కూడా ఇవి వ్యాపించనున్నట్లు తెలిపింది. ఈ రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు.. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇక వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా సిద్దవటంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, అన్నమయ్య జిల్లాల్లోని రాయచోటి, రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు–గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. ఆదివారం సా.5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత..ఆదివారం కురిసిన వర్షాల్లో పిడుగులు పడి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో పడవలో ఉన్న దుమ్ము పోలిరాజు అనే యువకుడు పిడుగు పడి అక్కడికక్కడే మరణించగా.. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో బోటు తనిఖీకి వెళ్లిన కంబాల ముత్యాలు అనే మరో మత్స్యకారుడు కూడా పిడుగుపడి చనిపోయాడు. ఆదివారం ఉదయం ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటకు పైగా ఉరుములు, మెరుపులు, పిడుగులు జనాన్ని భయకంపితులను చేశాయి.మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు కూడా పిడుగులకు బలయ్యారు. పొలాల్ని సాగుకు సిద్ధంచేసుకోవాలని వెళ్లిన పెద్ది చినవీరయ్య (58), చిరుతల శ్రీనివాసరావు (51) పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఉ.5.30 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లిన వీరు అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో సమీపంలోని వేప చెట్టు కిందకు వెళ్లగా అప్పుడే పెద్ద శబ్దంతో అదే చెట్టుపై పిడుగు పడింది. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. -
5 డిగ్రీల వరకు అధికంగా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా చాలాచోట్ల సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరో రెండ్రోజు లు ఇదే తరహాలో తీవ్రమైన ఎండలు ఉంటాయ ని వాతావరణశాఖ చెబుతోంది. శుక్రవారం రాష్ట్రంలో ని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 47.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.మంచిర్యాల జిల్లా భీమారంలో కూడా 47.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, నస్పూర్‌లో 46.9, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెలపాడులో 46.9, నల్లగొండ జిల్లా కేతెపల్లిలో 46.8, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 46.8, కరెపల్లెలో 46.6, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.6, మంచిర్యాల జిల్లా హీజీపూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 45.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా నల్లగొండలో 25.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2024 వేసవి సీజన్లో అత్యంత వేడిమి రోజుగా మే 30వతేదీ రికార్డు సృష్టించింది. మంచిర్యాల జిల్లా భీమారంలో గురువారం ఈ సీజన్లోనే అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇలావుండగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. శుక్రవారం తమిళనాడు, కర్ణాటక ల్లోకి ప్రవేశించినట్లు వాతావరణశాఖ తెలిపింది.శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో)కేంద్రం గరిష్టం ఖమ్మం 45.0 ఆదిలాబాద్ 44.3 రామగుండం 44.2 భద్రాచలం 43.8 హనుమకొండ 43.0 నల్లగొండ 43.0 మెదక్ 42.8 నిజామాబాద్ 42.7 మహబూబ్‌నగర్ 42.0 దుండిగల్ 41.0 హకీంపేట్ 41.0 హైదరాబాద్ 41.0 -
22న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తర ఈశాన్యం దిశగా ప్రయాణించి, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 24 నాటికల్లా వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 25, 26 తేదీల మధ్య ఇది తుఫాను లేదా తీవ్ర తుఫానుగా మారి విశాఖపట్నం – తూర్పు గోదావరి జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని, అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్ నుంచి కొమరిన్, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాయలసీమలో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల పాటు ఉత్తరాం«ధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. వైఎస్సార్ కడప, పశ్చిమ ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.పలుచోట్ల వర్షాలుశనివారం కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజలో 67.75 మిల్లీవీుటర్ల వర్షం పడింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 40 మిల్లీవీుటర్లు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మదీనాపాడులో 37, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరులో 27.5, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 27 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.ఉవ్వెత్తున అలలువాకాడు (తిరుపతి జిల్లా): వాతావరణంలో వచ్చిన మార్పులతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో శనివారం అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. సముద్రంపై పోరు గాలితోపాటు సుడులు తిప్పుతోంది. దీంతో తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది.29న అండమాన్‌కు నైరుతినైరుతి రుతుపవనాలు ఈ నెల 29 నాటికి అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1వ తేదీకి కేరళను రుతు పవనాలు తాకుతాయని, ఆ తర్వాత 2, 3 తేదీల్లో ఏపీకి విస్తరిస్తాయని పేర్కొంది. -
నేడు, రేపు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం శనివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు కొనసాగుతున్నట్లు వివరించింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వివరించింది.రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో 38.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 22.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.22న అల్పపీడనం.. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తర ఈశాన్యం దిశగా ప్రయాణించి, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 24 నాటికల్లా వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 25,26 తేదీల మధ్య ఇది తుపాను లేదా తీవ్ర తుపానుగా మారి విశాఖపట్నం – తూర్పు గోదావరి జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. -
వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుంది. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక, బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా వర్షాలు కురిశాయి. జిల్లాలోని కాకుమాను మండలంలో 75, ప్రత్తిపాడులో 50.4, దుగ్గిరాలలో 41.2, వట్టిచెరుకూరులో 24.6, తెనాలిలో 23.8, మంగళగిరిలో 15, పెదకాకానిలో 13, చేబ్రోలులో 12.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వానలు వీడలేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 60 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 46.6, ఇరగవరంలో 32.2, ఆచంటలో 20, పోడూరులో 19, పెంటపాడులో 17, తణుకులో 15 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలుచోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అనంతపురం జిల్లాలోని 10 మండలాల పరిధిలో 4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని 5 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఇది కూడా చదవండి: వెన్ను విరగని వరి! -
హైదరాబాద్: నేడు భారీ వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో మంగళవారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సోమవారం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు చెరువులను తలపించగా..మళ్లీ కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడ్డారు. బల్దియా సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో నగరంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టంచేసింది. విపత్తుస్పందనా దళం, బల్దియా, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సులేమాన్ నగర్లో 1.4 సెంటీమీటర్లు, మాదాపూర్, బోరబండ, చర్లపల్లి, శ్రీనగర్ కాలనీల్లో అరసెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్.. అయినా! -
డిసెంబర్ 2న 'బురేవి'.. 5న 'టకేటి'
సాక్షి, విశాఖపట్నం: ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్2న 'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. (వాయుగుండంగా బలహీనపడ్డ నివర్ తుపాను) -
రాష్ట్రంలో నేడు, రేపు పలుచోట్ల వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): నైరుతి అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఫలితంగా శుక్రవారం, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఈశాన్య, తూర్పుదిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. -
తీవ్ర తుపాను దిశగా ‘ఇటా’
మియామీ (యూఎస్): ఇటా తుపాను కరీబియన్‌లోని పలు ప్రాంతాలను బెంబేలెత్తిస్తోంది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ తుపాను మంగళవారం ఉదయానికి నికరాగ్వా, హోండూరస్ తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. నికరాగ్వా, హోండూరస్, జమైకా, కేమన్ ఐలాండ్స్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 53కు చేరిన టర్కీ భూకంప మృతులు ఇజ్మిర్: టర్కీలోని ఇజ్మిర్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 53కు చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 900 దాటింది. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో 70 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల కింద దాదాపు 34 గంటలు గడిపిన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
72 గంటలపాటు హైదరాబాద్‌లో అతిభారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : వాతావరణ శాఖ జారీచేసిన అంచనాల ప్రకారం రాబోయే 72 గంటల పాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీటర్ల అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడే వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ పరిధిలోని క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంచేసి, అందుబాటులో ఉంచాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లుగా గుర్తించిన పాఠశాలలో, కమ్యునిటీహాల్స్, ఇతర వసతులను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులందరూ అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశించారు. (రాష్ట్రంలో మళ్లీ వర్షాలు) -
మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 3 నుంచి 3.4 మీటర్ల ఎత్తు వరకూ ఎగసి పడతాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులెవ్వరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. (ఏపీలో హోరెత్తిన వాన) -
నేడు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు..
సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 3.6 కి.మీ.నుంచి 4.5 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. బుధ వారం ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం–ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరి సిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగు ళాంబ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు : మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ములుగులో 9.5, గోవిందరావుపేటలో 9, మంచిర్యాలలోని భీమినిలో 8.5, భోరజ్ల, గూడూరు, మంచిర్యాలలోని కొండాపూర్‌లో 8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’
సాక్షి, విశాఖపట్నం : నిసర్గ తుఫాను బుధవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర మహారాష్ట్ర వైపు గంటకు 12కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. అలీబాగ్‌కు దక్షిణ నైరుతి దిశగా 140 కి.మీ, ముంబైకి 190 కి.మీ, సూరత్‌కు 415 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌కు ఆనుకుని హరిహరేశ్వర్-దామన్ మద్య అలీబాగ్‌కు సమీపంలో నిసర్గ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. నిసర్గ తుఫాను ప్రభావం కారణంగా కొంకణ తీరం మొత్తం దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన ఇన్శాట్ త్రీడీ చిత్రాన్ని భారత వాతావరణ శాఖ తమ ట్విటర్ ఖాతాలో విడుదల చేసింది. ( నిసర్గ ఎఫెక్ట్: కరోనా పేషెంట్ల తరలింపు ) భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఇన్శాట్ త్రీడీ చిత్రం కాగా, గుజరాత్, మహారాష్ట్రలపై నిసర్గ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నారు. గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్సారీ, భరూచి జిల్లాల్లోని తీరప్రాంతాల్లో నివసించే 78,971 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. నిసర్గ తుపాను తాకిడిని తట్టుకునేందుకు రాష్ట్రంలో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. తుపాను 16 ఎన్డీఆర్ఎఫ్ యూనిట్లలో 10 బృందాలు తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఇంకా 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ( దూసుకొస్తున్న మరో తుపాను ) -
తీవ్ర తుఫానుగా మారిన ‘‘ఎంఫాన్’’
సాక్షి, అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ‘‘ఎంఫాన్’’ తుఫాను వాయువ్య దిశగా ప్రయాణించి తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం ఉదయం 08.30 గంటలకు తీవ్ర తుఫానుగా మారి అదే ప్రాంతంలో పారదీప్(ఒరిస్సా)కు దక్షిణ దిశగా 990 కి.మీ, డిగా(పశ్చిమ బెంగాల్) కు దక్షిణ నైఋతి దిశగా 1140 కి.మీ, ఖేపుపర(బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1260 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత తీవ్రమై రాగల 12 గంటలలో అతి తీవ్రతుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తదుపరి 24 గంటలలో ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాల వద్ద సాగర దీవులు(పశ్చిమ బెంగాల్), హతియా దీవులు(బంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రాలలో కొన్ని ప్రాంతాలకు ఈరోజు (మే 17 వ తేదీన) నైఋతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించారు. రాగల 48 గంటలలో దక్షిణ బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులలో మిగిలిన ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమ: ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. -
వాటర్ బాటిల్ తీసుకురా!
సాక్షి, హైదరాబాద్: ఓ వాటర్ బాటిల్ కంపెనీ కేసుపై సీరియస్‌గా వాదనలు జరుగుతున్నాయి. ఇంతలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ తనకొచ్చిన సందేహ నివృత్తికి వాదనలను ఆపారు. తన సిబ్బందిలోని ఓ వ్యక్తిని పిలిచి, జేబులో నుంచి డబ్బు తీసి హైకోర్టు క్యాంటీన్లో వాటర్ బాటిల్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి క్యాంటీన్‌కు వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చారు. దాన్ని పరిశీలించిన సీజే తన సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు. ఈ ఆసక్తికర ఘటన సోమవారం హైకోర్టులో చోటు చేసుకుంది. ఆ తర్వాత వాటర్ బాటిళ్లపై సరఫరాదారు చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తదితర వివరాలను పొందుపరచని కంపెనీలను నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు రెండు రోజుల గడువునిచ్చారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఎవరికి ఫిర్యాదు చేయాలి? హిందుస్తాన్ కోకాకోలా బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ మెదక్ జిల్లా, పాశమైలారంలోని హిమజల్ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘కిన్లే’బ్రాండ్ కింద తాగునీరు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న తూనికలు, కొలతల శాఖ అధికారులు హిమజల బేవరేజస్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ సరఫరాకు సిద్ధంగా ఉన్న బాటిళ్లపై ఫిర్యాదు ఇవ్వాల్సిన వ్యక్తి పేరు, చిరునామా లేదంటూ దాదాపు లక్ష బాటిళ్లను అధికారులు జప్తు చేశారు. దీనిని సవాల్ చేస్తూ హిమజల్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ముందు అప్పీల్‌కు అవకాశం ఉండటంతో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో హిమజల్ కంపెనీ కంట్రోలర్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కంట్రోలర్ వాటర్ బాటిళ్ల జప్తును సమర్థించారు. దీనిపై కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు అధికారుల తీరును తప్పుపట్టారు. ఆ బాటిళ్లపై కేవలం వ్యక్తి పేరు లేదన్న కారణంతో జప్తు చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ తరఫు న్యాయవాది జ్యోతికిరణ్ వాదనలు వినిపిస్తూ, నిబంధనల మేరకే తాము హిమజల్ కంపెనీలో ఉన్న వాటర్ బాటిళ్లను జప్తు చేశామన్నారు. వాదనలు వింటున్న సీజే తన డబ్బులతో హైకోర్టు క్యాంటీన్లో బిస్లరీ వాటర్ బాటిల్ తెప్పించుకుని పరిశీలించారు. ‘ఈ బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నంబరే ఉంది. అంతకు మించిన వివరాలు లేవు. ఈ బాటిళ్లలోని నీటిని కొందరు మినరల్ వాటర్ అంటున్నారు. వాస్తవానికి అవి ప్యాకేజ్డ్ వాటర్’ అని ఈ సందర్భంగా సీజే వ్యాఖ్యానించారు. -
రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు పుంజుకోవడంతో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వివరించింది. గురువారం వివిధ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట, మర్పల్లిల్లో 9 సెం.మీ., మహబూబ్‌నగర్ కొడంగల్, రంగారెడ్డి జిల్లా గండేడ్‌లలో 8 సెం.మీ., సంగారెడ్డిలో 5 సెం.మీ. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో 4 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు నగరంలో సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహన దారులు పలు ఇక్కట్లు పడ్డారు. -
కోస్తాంధ్ర, తెలంగాణలో అతిభారీ వర్షాలు
హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఖమ్మం జిల్లా పలుప్రాంతాలు.. ములకలపల్లిలో 17 సెం.మీ, టేకులపల్లిలో 14, చంద్రగొండలో 11.8, బయ్యారంలో 10.9 సెం.మీ నమోదైన వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో మొగుళ్లపల్లిలో 13 సెం.మీ, గోవిందరావుపేట 13 సెం.మీ, వెంకటాపూర్ 12.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో 3.6 సెం.మీ, విజయనగరంలో 3.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 2.3 సెం.మీ, కృష్ణా జిల్లాలో 2.1 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో తెలంగాణకు రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే 15 శాతం అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
చల్లబడ్డ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘రోను’ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎండలతో హడలిపోయిన ప్రజలు వాతావరణం చ ల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉండడంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లో 40కి మించి ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ రెండు మినహా మిగతా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు లోబడే ఉష్ణోగ్రతలు నమోదు నమోదు కావటం విశేషం. నగరంలో గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 60%గా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం వివిధ నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 43.2 28.7 భద్రాచలం 33.8 26.5 హకీంపేట 32.4 25.2 హన్మకొండ 38.6 28.5 హైదరాబాద్ 33.0 25.9 ఖమ్మం 30.6 24.4 మహబూబ్‌నగర్ - 27.5 మెదక్ 37.2 26.9 నల్లగొండ 31.8 25.6 నిజామాబాద్ 41.6 30.1 రామగుండం 35.4 26.6 -
మరో 4 రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలుంటాయని, క్యుములోనింబస్ మేఘాల కారణంగా సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్‌లో 2 సెంటీమీటర్లు, చిన్నచింతకుంట, మార్పల్లెలో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో 2.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. జనం కాస్త సేదతీరుతున్నారు. హన్మకొండలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత హన్మకొండ 42.3 రామగుండం 40.4 భద్రాచలం 40.0 నిజామాబాద్ 39.4 ఆదిలాబాద్ 38.8 మెదక్ 38.4 మహబూబ్‌నగర్ 38.3 ఖమ్మం 38.2 నల్లగొండ 37.4 హైదరాబాద్ 37.3