రాష్ట్రంలో తీవ్రస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు
అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదు
మరో రెండు రోజులు భగభగలే
ఈ సీజన్‌లోనే అత్యధిక వేడిమి రోజుగా మే 30
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా చాలాచోట్ల సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరో రెండ్రోజు లు ఇదే తరహాలో తీవ్రమైన ఎండలు ఉంటాయ ని వాతావరణశాఖ చెబుతోంది. శుక్రవారం రాష్ట్రంలో ని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 47.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
మంచిర్యాల జిల్లా భీమారంలో కూడా 47.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, నస్పూర్‌లో 46.9, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెలపాడులో 46.9, నల్లగొండ జిల్లా కేతెపల్లిలో 46.8, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 46.8, కరెపల్లెలో 46.6, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.6, మంచిర్యాల జిల్లా హీజీపూర్‌లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 45.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా నల్లగొండలో 25.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2024 వేసవి సీజన్‌లో అత్యంత వేడిమి రోజుగా మే 30వతేదీ రికార్డు సృష్టించింది. మంచిర్యాల జిల్లా భీమారంలో గురువారం ఈ సీజన్లోనే అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇలావుండగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. శుక్రవారం తమిళనాడు, కర్ణాటక ల్లోకి ప్రవేశించినట్లు వాతావరణశాఖ తెలిపింది.
శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో)
కేంద్రం గరిష్టం
ఖమ్మం 45.0
ఆదిలాబాద్ 44.3
రామగుండం 44.2
భద్రాచలం 43.8
హనుమకొండ 43.0
నల్లగొండ 43.0
మెదక్ 42.8
నిజామాబాద్ 42.7
మహబూబ్‌నగర్ 42.0
దుండిగల్ 41.0
హకీంపేట్ 41.0
హైదరాబాద్ 41.0
Comments
Please login to add a commentAdd a comment