హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజలు భయటకు రావలంటేనే భయపడిపోతున్నారు. ఒకవైపు కరువు, ఎండల తీవ్రత, మరోవైపు అకాల వర్షాలతో మానవాళి మనుగడపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా భయంకరమైన కరువు దాపరించి తాగునీరు లేక రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలోని అనంతపురం జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగతా జిల్లాల్లో కర్నూలు 42.5, డిగ్రీలు, నెల్లూరు 37 డిగ్రీలు, కాకినాడ 36 డిగ్రీలు, మచిలీపట్నం 34 డిగ్రీలు, విశాఖ 34.8 డిగ్రీల సెంట్రీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అదేవిధంగా తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ 41 డిగ్రీలు, హన్మకొండ 41 డిగ్రీల సెంట్రీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది.
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు
Published Tue, Apr 5 2016 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement