
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఈశాన్య భారతంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే ఏడు రోజుల్లో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని, పర్వత ప్రాంతాల్లో విపరీతంగా మంచుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ తుఫాను ప్రభావం నాగాలాండ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ఉండనుంది. ఫిబ్రవరి 19న అసోం, మేఘాలయలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 21న పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ,పశ్చిమబెంగాల్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలకు ఇప్పటికే వర్ష సూచన హెచ్చరికలు జారీ చేశారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో బీహార్‌లోని 16 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో బుధవారం, గురువారం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19, 20 తేదీలలో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్
Comments
Please login to add a commentAdd a comment