రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు | Heavy rains to be falled in two days | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు

Published Fri, Jul 22 2016 2:59 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

Heavy rains to be falled in two days

సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు పుంజుకోవడంతో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వివరించింది. గురువారం వివిధ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట, మర్పల్లిల్లో 9 సెం.మీ., మహబూబ్‌నగర్ కొడంగల్, రంగారెడ్డి జిల్లా గండేడ్‌లలో 8 సెం.మీ., సంగారెడ్డిలో 5 సెం.మీ. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో 4 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు నగరంలో సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహన దారులు పలు ఇక్కట్లు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement