![Chances Of Rain In The State Says Meteorological Dept - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/20/Rain.jpg.webp?itok=FkJLwC9a)
మహారాణిపేట (విశాఖ దక్షిణ): నైరుతి అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఫలితంగా శుక్రవారం, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఈశాన్య, తూర్పుదిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment