కోస్తాంధ్ర తీరం మీదుగా ఆగ్నేయ, దక్షిణ దిశగా చల్లని గాలులు వీస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
విశాఖపట్నం : కోస్తాంధ్ర తీరం మీదుగా ఆగ్నేయ, దక్షిణ దిశగా చల్లని గాలులు వీస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక మీదగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు.
అయితే ఆ ఆవర్తనంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉందన్నారు. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.