మ‌రో రెండురోజుల పాటు భారీ వ‌ర్షాలు | Meteorological Department Forecast Heavy Rains For Next Few Days | Sakshi
Sakshi News home page

మ‌రో రెండురోజుల పాటు భారీ వ‌ర్షాలు

Published Tue, Sep 15 2020 10:31 AM | Last Updated on Tue, Sep 15 2020 10:38 AM

Meteorological Department Forecast  Heavy Rains For Next Few Days  - Sakshi

సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన  అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.  సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 3 నుంచి 3.4 మీటర్ల ఎత్తు వరకూ ఎగసి పడతాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులెవ్వరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. (ఏపీలో హోరెత్తిన వాన)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement