heavyrains
-
సర్కార్ వైఫల్యంతోనే భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో ఆస్తి, పంట నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి భట్టి రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం వివరాలను అందజేశారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ , రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని సమాయత్తం చేయకుండా నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే ఇంత నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరగడం వల్లనే అనేక ప్రాంతాలు, గిరిజన గూడేలు ముంపునకు గురయ్యాయన్నారు. మున్నేరు, కిన్నెరసాని నదులపై నిర్మించిన చెక్ డ్యాములను ఇంజనీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. మహారాష్ట్రకు విమానాలు పంపించారు కానీ ఇక్కడ వరద ప్రాంతాలకుహెలికాప్టర్లు పంపించలేదు ప్రజల అవసరాల కోసం కాకుండా కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారని భట్టి ఆరోపించారు. మహారాష్ట్రకు ప్రత్యేక విమానాలు పంపించి అక్కడి నాయకులను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని గులాబీ కండువాలు కప్పే దానిపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో లేకుండా పోయందని విమర్శించారు. మహారాష్ట్రకు విమానాలు పంపించిన సీఎం కేసీఆర్ గోదావరి వరదలతో మునిగిపోయిన ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రజలను ఆదుకోవడానికి హెలికాప్టర్లు పంపించ లేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బాధితులను, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా కేసీఆర్ మహారాష్ట్ర టూర్ కి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ విజయమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గతంలో తాము కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తప్పు పట్టారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిందని, ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆర్టీసీకి ఆస్తులు కూడబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ సంపాదించి పెట్టిన ఆర్టీసీ ఆస్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే రోడ్లపైకి వస్తామని భట్టి హెచ్చరించారు. వరద సహాయం సరిపోదు: గవర్నర్ తమిళిసై ఊహించిన దానికంటే పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి పునరావాస కేంద్రాలను పెంచాలి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలి కుంభవృష్టిగా కురిసిన వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించిన దానికంటే పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అందిస్తున్న సహాయం సరిపోదని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వరదల విధ్వంసం కొనసాగుతున్న నేపథ్యంలో వీటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు మధ్య తెలంగాణకు పరీక్షా సమయమని, ఇక్కడ తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు సాధ్యమైనంతగా సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర, కేంద్ర, జిల్లా కార్యాలయాలకు పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగంతో కలిసి వరద బాధితులకు ఇప్పటికే రెడ్‌క్రాస్ సహాయం అందిస్తోందన్నారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే ఆహారం, ఆశ్రయం, వంట సామాగ్రి, ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, వరద నష్టాన్ని వేగంగా అంచనా వేయాలని సూచించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, యూఎన్డీపీ, యూనిసెఫ్, సీఎస్ఆర్ ఫౌండేషన్లు, వైద్యులు, మీడియా భాగస్వామ్యంతో కింది సేవలు అందించాలని పిలుపునిచ్చారు. తక్షణ ఉపశమనంగా షెల్టర్ హోమ్స్, ఆహారం, తాగునీటి సరఫరా, అత్యవసర వైద్య బృందాల ను పంపించాలి. శిథిలాల తొలగింపు చేపట్టాలి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎన్డీ ఆర్ఎఫ్ బృందాలు చర్యలు తీసుకోవాలి. చిన్నారులు, బాలికలు, మహిళల రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రాణ, ఆస్తి, ఉపాధికి జరిగిన నష్టాన్ని కచ్చితంగా మదించి పునరావాసం కల్పించాలి. బిల్లులు తిప్పి పంపడానికి కారణాలున్నాయి.. ప్రభుత్వానికి మూడు బిల్లులు వెనక్కి పంపించడానికి కారణాలున్నాయని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లు లను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి మళ్లీ గవర్నర్‌కు పంపిస్తామని, అప్పుడు ఆమోదించక తప్పదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య లపై ఆమె మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. ‘నేను పంపించిన మూడు బిల్లులు ఎందుకు పంపించానో వివరంగా పేర్కొన్నాను. అందుకు సహేతుక కారణాలున్నాయి. ప్రతి బిల్లుపై నాకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరా. కావాలని ఏ బిల్లునూ కారణం లేకుండా తిప్పి పంపలేదు. బిల్లులు ఆపేశానని అనవసరంగా నిందించడం సరి కాదు’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
తగ్గేదేలే అంటున్న టమాటా.. కిలో ఎంతంటే..
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు తగ్గనంటున్నాయి. గత నెల నుంచి ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా సరఫరా కావడంలేదు. ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్పల్లి, మాదన్నపేట, ఎల్బీనగర్ మార్కెట్లలో టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్క వ్యవసాయ మార్కెట్లలో ధరలు పెరిగిపోతుంటే, మరోపక్క కొందరు రిటైల్ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నగరానికి రోజుకు దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్ ఉంది. కానీ ప్రస్తుతం మార్కెట్‌కు సరఫరా అవుతోంది మాత్రం 40 నుంచి 50 లారీలే. తెలంగాణ జిల్లాల నుంచి టమాటా దిగుమతులు తగ్గడంతో పొరుగు రాష్ట్రాలపైనే వ్యాపారులు ఆధారపడాల్సివస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని రోజులుగా నగరానికి టమాటా తరలిస్తున్నారు. అయినా.. నగర అవసరాలను తీర్చలేకపోతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 10 నుంచి 15 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 35 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. కానీ నగర అవసరాలకు దాదాపు 75 లారీల నుంచి 120 లారీల వరకు డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో టమాటా రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. రిటైల్ వ్యాపారులు రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. -
భాగ్యనగరంలో హడలెత్తిస్తున్న వర్షం ఫొటోలు
-
ట్రాఫిక్ కానిస్టేబుల్ వైరల్ వీడియో
సాక్షి, చెన్నై: భారీ వర్షంలో కూడా డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముత్తురాజా రెయిన్ కోటుధరించి మరీ విధి నిర్వహణలో నిబద్ధతను ప్రదర్శించారు. దీంతో సదరు కానిస్టేబుల్ని ప్రశంసిస్తూ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 13 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు హోరు వానలో బిజీ రోడ్డులో అత్యంత అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న ముత్తురాజాకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించాయితూత్తుకుడి ఎస్పీ జయకుమార్ ముత్తురాజాను అభినందిం చడంతోపాటు, అతనికి బహుమతి కూడా ప్రకటించారు. రియల్ హీరో, అభినందనలు అంటూ చాలామంది ముత్తురాజాను అభినందిస్తున్నారు. మరోవైపు కష్టపడి పనిచేసే ప్రభుత్వోద్యోగులందరూ గర్వకారణమే! కానీ ట్రాఫిక్ పోలీసులు సురక్షిత పరిస్థితులో పనిచేసేలా ఎందుకు చర్యలు తీసుకోలేదు! ఎవరు పట్టించుకుంటారు!! అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. -
హైదరాబాద్‌లో వీడని వరద కష్టాలు ఫొటోలు
-
సాధారణం కంటే అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు నెలల వర్షాకాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది మంచి వర్షాలు కురిశాయని తెలియజేసింది. ఈ ఏడాది కురిసిన వర్షం గత 30 ఏళ్లలో మూడో అతిపెద్ద వర్షపాతమని వెల్లడించింది. దేశంలో నాలుగు నెలల్లో సగటున(ఎల్పీఏ) 109 శాతం వర్షం కురిసింది. సాధారణం కంటే అధికంగా జూన్‌లో 118 శాతం, ఆగస్టులో 127, సెప్టెంబర్‌లో 104 శాతం వర్షం పడింది. జూలైలో మాత్రం కేవలం 90 శాతం వర్షం కురిసింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సగటున 95.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జాతీయ వాతావరణ అంచనా కేంద్రం(ఎన్‌డబ్ల్యూఎఫ్‌సీ) శాస్త్రవేత్త ఆర్కే జెన్మానీ తెలిపారు. ఈసారి 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, మేఘాలయా, గోవా, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్‌లో సాధారణ కంటే అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో ఎల్పీఏ 127గా నమోదైంది. గత 44 ఏళ్లలో ఒక నెలలో ఈ స్థాయిలో వర్షం పడడం ఇదే మొదటిసారి. 1976 ఆగస్టులో 128.4 ఎల్‌పీఎ నమోదైంది. రికార్డు స్థాయిలో పంటల సాగు భారత్‌లో వర్షాల సీజన్ జూన్ 1న మొదలై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. దేశంలో వార్షిక వర్షపాతంలో 70 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తాయి. దేశంలో ఈసారి మంచి వర్షాలు కురవడంతో రైతన్నలు రికార్డు స్థాయిలో గత వారం నాటికి 1,116.88 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలియజేసింది. గత సంవత్సరం కేవలం 1,066.06 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయని గుర్తుచేసింది. -
భాగ్యనగరంలో హడలెత్తిస్తున్న వర్షం
-
మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 3 నుంచి 3.4 మీటర్ల ఎత్తు వరకూ ఎగసి పడతాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులెవ్వరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. (ఏపీలో హోరెత్తిన వాన) -
భాగ్యనగరంలో హడలెత్తిస్తున్న వర్షం
-
చెన్నైని ముంచెత్తిన వర్షాలు
సాక్షి, చెన్నై: భారీ వర్షాలతో చెన్నై నగరం సహా తమిళనాడు తడిసిముద్దయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం దక్షిణాది తీరంలో కుండపోత ప్రారంభమైంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెదర్ అంచనా వేసింది. కుండపోతతో చెన్నైలో నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సహాయ పునరావాస కమిషనర్ పేర్కొన్నారు. 2015లో చెన్నైని వణికించిన వరద బీభత్సంతో ముందు జాగ్రత్త చర్యలకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. మరోవైపు కేరళలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనాతో ఇటీవల వరదలతో తల్లడిల్లిన క్రమంలో అధికారులు తాజా రెడ్ అలర్ట్‌తో అప్రమత్తమయ్యారు. ఇడుక్కి, మలప్పురం జిల్లాల అధికారులు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధమయ్యారు. కర్ణాటకలోనూ విస్తారంగా వర్సాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించడంతో దక్షిణ కర్నాటకలోని 12 జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. -
కేరళ వరదలు: మాది ప్రత్యేక బాధ్యత
వరద విపత్తుతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ముందుకు వచ్చింది. రాష్ట్రంలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లోని బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సమాయత్తమవుతోంది. వారిని ఆదుకునేందుకు ఒక నేషనల్ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వరదలతో ఇబ్బందులు పడుతున్న కేరళ ప్రజలకు సహాయం అందించేందుకు జాతీయ అత్యవసర కమిటీని ఏర్పాటు చేయాలని యుఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా ఆదేశించారు. యుఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం మాట్లాడుతూ భారీగా వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయపడేందుకు, వారికి ఆపన్నహస్తం అందివ్వాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై వుందని వ్యాఖ్యానించారు. యుఏఈ సక్సెస్ స్టోరీలో కేరళ ప్రజల భాగస్వామ్యం కీలకమైందని వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. కేరళ ప్రజలకు సాయం చేసేందుకు బిజినెస్ లీడర్లు, ప్రజా సంఘాలు, కార్యకర్తలతో ఆదివారం చర్చించనున్నట్టు భారతదేశంలో యూఏఈ రాయబారి, నవదీప్ సింగ్ సూరి చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలందరూ భారీగా విరాళాలివ్వాలని ఆయన ట్విటర్ ద్వారా కోరారు. దీంతోపాటు ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేరళ సీఎంవో చేసిన ట్వీట్ యుఏఈ రాయబార కార్యాలయం రీ ట్వీట్ చేసింది. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజులుగా దయనీయమైన, అధ్వాన్నమై వాతావరణం అక్కడి ప్రజలను బాధిస్తోంది. దాదాపు 13జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. దాదాపు100 డ్యాములు, రిజర్వాయర్లు, నదులు మునిగిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 26వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. సహాయక శిబిరాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికి 324 మంది మృతి చెందగా 3లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా యుఏఈలో పనిచేస్తున్న అనేకమంది ఉద్యోగులు కేరళకు చెందిన వారే. I will chair a meeting on Sunday with major community organisations, activists and business leaders to coordinate relief support from UAE. Please contribute generously during this unprecedented crisis.#KeralaFloods#HelpKerala — IndAmbUAE (@navdeepsuri) August 17, 2018 Here's how you can help those affected by the unprecedented floods in Kerala. Now you can make donations online to Chief Minister's Distress Relief Fund through the site, https://t.co/OFHTHlZ9by #KeralaFloods #StandWithKerala. pic.twitter.com/XNlBKqdCUT — CMO Kerala (@CMOKerala) August 14, 2018 -
భాగ్యనగరంలో భారీ వర్షం
-
ఒంటిమిట్టలో భారీ వర్షం
-
ఉరిమిన ఆకాశం..
-
జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు
సాక్షి, నెట్వర్క్: జిల్లాలో శనివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరి విత్తనాలు వేసిన తర్వాత సరైన వర్షం పడక ఆకుమడులకు, నారుమడుల దుక్కులకు నీరులేక రైతులు అల్లాడుతున్న సమయంలో ఈ వర్షం మేలుచేస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరుకు మొక్కతోటలకు కూడా ఈ వర్షం ఉపయోగపడింది. అత్యధికంగా చోడవరంలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రోలుగుంట మండలంలోని కొవ్వూరు, బోగాపురం, కంచుగుమల, అడ్డసరం, కండపాలెం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. బుచ్చెయ్యపేట మండలంలో కుండపోతగా వర్షం కురిసింది. జన జీవనం స్తంభించింది. ఇక్కడ 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేజర్ పంచాయతీ వడ్డాది నాలులు రోడ్ల జంక్షన్లో వరద నీటితో నిండిపోయి చెరువును తలపించింది. మాడుగుల నియోజకవర్గ పరిధిలో మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడుతో పాటు అనకాపల్లి మండలాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తాచేరు, పెద్దేరు, జలాశయాల్లో నీరు చేరింది. మన్యంలో భారీ వర్షం విశాఖ మన్యంలో శనివారం భారీ వర్షం కురిసింది. పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, సీలేరులో భారీ వర్ష ం కురిసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జి.మాడుగుల మండలంలో వంతాల, పెదలోచలి, సొలభం, గడుతూరు, లువ్వాసింగి, కోరాపల్లి పంచాయతీల్లో భారీ వర్షం కురిసింది. వరి నాట్లు వేసి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వేరుశనగ, రాగుల, ఇతర పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి మండలంలో లోతుగెడ్డ జంక్షన్, తాజంగి, లంబసింగి, లోతుగెడ్డ, అన్నవరం ప్రాంతాలో భారీ వర్షం కురిసింది. హుకుంపేటలో కురిసిన వర్షానికి వారపుసంతకు ఆటంకం ఏర్పడింది. పెదబయలు మండలంలో కురిసిన భారీ వర్షానికి వరి నాట్లు, నారుమడులు కొట్టుకుపోయాయి. సీతగుంట పంచాయతీలో ముసిడిపుట్టు, కిత్తుకొండ, సీకరి, అరడకోట పంచాయతీలోని పన్నెడ, లకేయిపుట్టు, పులుసుమామిడి గ్రామాల్లో వరినాట్లపై నుంచి వరదనీరు పారడంతో ఇసుక మేట వేసింది. పన్నెడ గ్రామ సమీపంలో ప్రధాన ఆర్అండ్బీ రోడ్డుపై నుంచి వరదనీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యగెడ్డ, రెయ్యలగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి.