
సాక్షి, చెన్నై: భారీ వర్షంలో కూడా డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముత్తురాజా రెయిన్ కోటుధరించి మరీ విధి నిర్వహణలో నిబద్ధతను ప్రదర్శించారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ని ప్రశంసిస్తూ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 13 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు హోరు వానలో బిజీ రోడ్డులో అత్యంత అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న ముత్తురాజాకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించాయితూత్తుకుడి ఎస్‌పీ జయకుమార్ ముత్తురాజాను అభినందిం చడంతోపాటు, అతనికి బహుమతి కూడా ప్రకటించారు.
రియల్ హీరో, అభినందనలు అంటూ చాలామంది ముత్తురాజాను అభినందిస్తున్నారు. మరోవైపు కష్టపడి పనిచేసే ప్రభుత్వోద్యోగులందరూ గర్వకారణమే! కానీ ట్రాఫిక్ పోలీసులు సురక్షిత పరిస్థితులో పనిచేసేలా ఎందుకు చర్యలు తీసుకోలేదు! ఎవరు పట్టించుకుంటారు!! అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment