ఈ ఏడాది 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు! | This year 47 degrees celsius, says metrological department | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు!

Published Thu, Mar 24 2016 12:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

ఈ ఏడాది 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు!

ఈ ఏడాది 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు!

హైదరాబాద్ : గత పదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోల పొడి వాతావరణం నెలకొందని పేర్కొంది.  వాయవ్య పశ్చిమం నుంచి వీచే పొడిగాలుల ప్రభావంతో వాతావరణంలో తేమ లేదని... అందువల్ల మేఘాలు కూడా లేవని స్పష్టం చేసింది.

ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో సూర్యశక్తి నేరుగా భూమిని తాకడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వివరించింది. గత ఏడాది మే నెలలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినాయని వాతావరణశాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే ఈ ఏడాది 47 డిగ్రీల ఉష్ణోగ్రతలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

కోస్తా, రాయలసీమ, తెలంగాణలో పొడిగాలులు వీస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారీగా ఉన్న ఉష్ణోగ్రతలు... రెండుమూడు రోజుల తర్వాత... కొద్దిగా తగ్గినా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement