సాక్షి, హైదరాబాద్: ‘రోను’ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎండలతో హడలిపోయిన ప్రజలు వాతావరణం చ ల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉండడంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లో 40కి మించి ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ రెండు మినహా మిగతా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు లోబడే ఉష్ణోగ్రతలు నమోదు నమోదు కావటం విశేషం. నగరంలో గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 60%గా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
గురువారం వివిధ నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం గరిష్టం కనిష్టం
ఆదిలాబాద్ 43.2 28.7
భద్రాచలం 33.8 26.5
హకీంపేట 32.4 25.2
హన్మకొండ 38.6 28.5
హైదరాబాద్ 33.0 25.9
ఖమ్మం 30.6 24.4
మహబూబ్‌నగర్ - 27.5
మెదక్ 37.2 26.9
నల్లగొండ 31.8 25.6
నిజామాబాద్ 41.6 30.1
రామగుండం 35.4 26.6
చల్లబడ్డ తెలంగాణ
Published Fri, May 20 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM
Advertisement
Advertisement