సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అయిదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో మిగతా జిల్లాలకు అరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. వచ్చే 24 గంట ల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముంది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతోంది.
రుతుపవనాల ద్రోణి ఇప్పుడు సముద్రమట్టం వద్ద జైసల్మేర్ నుంచి వాయవ్యకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతతీరం, ఆగ్నేయదిశ గా ఉత్తర అండమాన్ సముద్రం వరకూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మంగళవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండ్రోజులు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.
చదవండి: hyderabad: మట్టిగణపతుల తయారీ.. సగానికి తగ్గిన వ్యయం
గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 24 గంటల్లో కొము రంభీం జిల్లా బెజ్జూరులో 11 సెం.మీ. భారీ వర్షం కురిసింది. జూలూరుపాడు, ఆసిఫాబాద్, పేరూరులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వెంకటాపురం, పెద్దపల్లి, సత్తుపల్లిలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment