సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 35.31 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... 55.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
చదవండి: భద్రాచలం వద్ద తగ్గిన వరద ఉధృతి
కాగా ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్లు, మేడ్చల్ 37.5, మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ 35, యాదాద్రి జిల్లా బీబీనగర్ 27.5, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పూర్ 27, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్ 26.8, మేడ్చల్ జిల్లా కేశవరం 26, ఆలియాబాద్ 25, బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment