Vijayawada railway division
-
AP: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్లోని అనకాపల్లి–తాడి సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు పలు రైళ్లను పూర్తిగా, మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్లు: మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైలు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు, విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు, విజయవాడ–విశాఖపట్నం (22702/22701) రైళ్లు సెప్టెంబర్ 2, 4 తేదీల్లో, రాజమండ్రి–విశాఖపట్నం (07466/07467), గుంటూరు–విశాఖపట్నం (17239), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268) రైళ్లు సెప్టెంబర్ 4న, విశాఖపట్నం–గుంటూరు (17240) రైలు సెప్టెంబర్ 5న రద్దు చేశారు. పాక్షికంగా రద్దు: తిరుపతి–విశాఖపట్నం (22708) రైలు సెప్టెంబర్ 1, 3 తేదీల్లో, విశాఖపట్నం–తిరుపతి (22707) సామర్లకోట–విశాఖపట్నం మధ్య సెప్టెంబర్ 3, 5 తేదీల్లో, విజయవాడ–విశాఖపట్నం (12718/12717) రైళ్లు విశాఖపట్నం–అనకాపల్లి మధ్య ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు. చదవండి: AP: కార్ల అమ్మకాలు రయ్ రయ్ -
నర్సాపూర్–యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్–యశ్వంత్‌పూర్ మధ్య 6 వారంతపు సర్విసులు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–యశ్వంత్‌పూర్ (07687) ఈ నెల 14, 21, 28 తేదీలలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి 7.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07688) ఈ నెల 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. -
విజయవాడ రైల్వే డివిజన్లో కరోనా కలకలం
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కరోనా మూడో వేవ్ విజయవాడ రైల్వే డివిజన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క రోజులోనే 104 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 50 మంది మెయిల్, ప్యాసింజర్, గూడ్స్ లోకో పైలట్లు, 49 మంది అసిస్టెంట్ లోకో పైలట్లు ఉన్నారు. కరోనా సోకిన వారిని అధికారులు క్వారంటైన్‌కు పంపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో లోకో పైలట్లు, అసిస్టెంట్ పైలట్లు కరోనా బారిన పడటంతో సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పలు గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల రద్దు తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా మచిలీపట్నం–సికింద్రాబాద్‌ల మధ్య ప్రకటించిన ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల(07577/07578)ను ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు చేశారు. కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య 8 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రత్యేక రైలు(07295) ఈ నెల 24, 26, 28, 31 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07296) ఈ నెల 25, 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో సాయంత్రం 4.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. -
రైల్ కార్గో రవాణాలో ‘త్రివేణి’
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కార్గో రవాణాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో ఘనత సాధించింది. తక్కువ సమయంలో ఎక్కువ సరుకు రవాణా చేసేలా ఇటీవల మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒకే రైలుగా ‘త్రిశూల్’ పేరుతో విజయవంతంగా నడిపిన విజయవాడ డివిజన్ అధికారులు త్రివేణి మిషన్ పేరిట ఆదివారం నాలుగు అతి పొడవైన గూడ్స్ రైళ్లను నడిపి మరో ఘనత సాధించారు. రెండేసి గూడ్స్ రైళ్లను జతచేసి 118 వ్యాగన్లు ఉన్న ఓ భారీ రైలుగా మలిచారు. ఆ విధంగా ఎనిమిది రైళ్లను నాలుగు భారీ రైళ్లుగా చేసి మూడు గమ్యస్థానాలకు కార్గో రవాణా చేశారు. వాటిలో ఒక రైలును విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా తాల్చేర్ వరకు 900 కిలోమీటర్లు నడిపారు. మరో గూడ్స్ రైలును కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లి మీదుగా కేశోరామ్ సిమెంట్ కంపెనీకి 645 కిలోమీటర్లు కార్గో రవాణా చేశారు. బీసీఎన్ రేక్స్ గల రెండు భారీ గూడ్స్ రైళ్లను విజయవాడ నుంచి కొండపల్లి వరకు నడిపారు. తద్వారా కార్గో రవాణా సామర్థ్యాన్ని అమాంతంగా పెంచుకుని విజయవాడ రైల్వే డివిజన్ దేశంలోనే గుర్తింపు పొందింది. రోలింగ్ స్టాక్ నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచింది. తద్వారా కార్గో రవాణా వేగం పెరగడంతోపాటు తక్కువ సమయంలో లోడింగ్/అన్లోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. ఖాళీ అయిన వ్యాగన్లు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరతాయి. సిబ్బంది అవసరం తగ్గడంతోపాటు రైలు మార్గంలో రద్దీ తగ్గడంతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. భారీ రైళ్లను సమర్థంగా నిర్వహించినందుకు విజయవాడ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. -
విజయవాడ నుంచి దువ్వాడకు మొదటి ‘త్రిశూల్’
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటిసారిగా ‘త్రిశూల్’ రైలును విజయవాడ డివిజన్ నుంచి విజయవంతంగా నడిపించారు. మూడు గూడ్స్ రైళ్లను జతపరిచి మొత్తం 176 వ్యాగన్లతో ఒకే రైలుగా ఏర్పాటు చేసి, దీనికి ‘త్రిశూల్’ అని పేరుపెట్టారు. ఈ రైలును గురువారం విజయవాడ నుంచి దక్షిణ మధ్య రైల్వే చివరి స్టేషన్ అయిన దువ్వాడ వరకు నడిపారు. ‘త్రిశూల్’ గంటకు 50 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణించింది. వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు, ఖాళీ వ్యాగన్లను లోడింగ్ పాయింట్‌కు తక్కువ సమయంలో చేర్చేందుకు, భారీ డిమాండ్ ఉన్న సరుకుల రవాణాకు ఈ త్రిశూల్ రైలు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ త్రిశూల్ రైలు నిర్వహణకు కృషి చేసిన విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. -
అత్యధిక సోలార్ ఉత్పాదక స్టేషన్‌గా విజయవాడ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విద్యుత్ ఆదాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో అడుగు ముందుకేసింది. విజయవాడ రైల్వే స్టేషన్లో అదనంగా రూ.62 లక్షలతో మరో 65 కిలో వాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌తో ప్లాట్ ఫారాల పైకప్పులు ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ రైల్వేలోనే తొలిసారిగా 130 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి గల స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించింది. బుధవారం డీఆర్ఎం శ్రీనివాస్ స్టేషన్‌లోని సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్‌ను ప్రారంభించారు. 2019 డిసెంబర్లో 4, 5 ప్లాట్‌ఫారాలపై 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటికి అదనంగా మరో 54 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్‌ను 4, 5 ప్లాట్‌ఫారాలలో, 11 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్‌ను 8, 9 ప్లాట్‌ఫారాలలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్టేషన్ అవసరాలకు వినియోగించే విద్యుత్ సరఫరాలో ఏడాదికి 2.12 లక్షల యూనిట్లను తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.16.36 లక్షలు ఆదా అవుతుంది. -
ట్వీట్ చేస్తే కార్గో సేవలు
సాక్షి,అమరావతి : దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే కార్గో ఎక్స్‌ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు 5 నుంచి తొలి సర్వీసును ప్రారంభించనున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద కార్గో ఎక్స్‌ప్రెస్‌ను నడపనుంది. చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా.. నాన్ బల్క్ (తక్కువ పరిమాణం)లో సరుకులు చేర్చాలని ఆ శాఖ నిర్ణయించింది. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు.. చిన్న పరిశ్రమదారులు తమ సరుకును కార్గో ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా ప్రాంతాలకు చేర్చే అవకాశం లభిస్తుంది. ఇక ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా కార్గో బుకింగ్ చేసుకునేలా విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ వెల్లడించిన పూర్తి వివరాలు ఇవి.. కార్గో ఎక్స్‌ప్రెస్ చార్జీలు సరుకును బట్టి మారతాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రవాణా చార్జీలు టన్నుకు సగటున రూ.2,500 వరకు ఉంటాయి. రోడ్డు రవాణా, ప్రస్తుత రైల్వే టారిఫ్‌తో పోలిస్తే 40 శాతం చార్జీలు తక్కువ. ట్విట్టర్ ద్వారా బుకింగ్ నిమిత్తం విజయవాడ రైల్వే కమర్షియల్ విభాగం అధికారులు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టం అందుబాటులోకి తెచ్చారు. బుకింగ్ కోసం ట్విట్టర్ అకౌంట్ Vijayawada_RailFreight (@Bzarailfreight) ద్వారా రైల్వే అధికారులను పని దినాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. వినియోగదారులు సరుకు రవాణా రిజిస్ట్రేషన్, వ్యాగన్ల బుకింగ్ కోసం సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరును, లేదా దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లోనూ సంప్రదించవచ్చు. -
కరోనా ఎఫెక్ట్: 7 ప్రత్యేక రైళ్ల సేవలు రద్దు
సాక్షి, విజయవాడ: కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే ఆసుపత్రుల్లో సైతం కరోనా వార్డులను ఏర్పాటు చేసినట్లు విజయవాడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ సురేష్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యంత రద్ధీ గల రైల్యే స్టేషన్లలో విజయవాడ ఒకటని చెప్పారు. ఈ స్టేషన్ నుంచి ప్రతి రోజు రెండు వందల రైళ్లు రాక పోకలు సాగిస్తుంటాయని తెలిపారు. అదే విధంగా సూమారు లక్ష 30 వేల మంది ప్రయాణం చేస్తుంటారన్నారు. చదవండి: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు కాగా జనసమూహం ఎక్కువగా ఉండటంతో కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపట్టామని, పాసింజర్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. అంతేగాక ముఖ్యమైన ప్రదేశాలలో వాల్ పోస్టర్లు డిస్ ప్లే చేయడం, ప్రయాణికులకు అవగాహన కోసం ప్రకటనలు చేయిస్తున్నామని తెలిపారు. రైల్యే సిబ్బంది కూడా శానిటైజర్స్, మాస్క్ లు, గ్లౌజులు ధరించి పనిచేస్తున్నారని చెప్పారు. క్లినింగ్‌లో సోడియం ఐసోక్లోరైడ్ వాడుతున్నామన్నారు. కాగా విజయవాడ మీదుగా నడిచే 7 ప్రత్యేక రైళ్ల సర్వీసులు రద్ద చేయగా.. ప్రతిరోజు క్రమంగా నడిచే రైల్లు మాత్రం యదావిధిగా నడుస్తాయని చెప్పారు. ఇక ఈ స్టేషన్ పరిధిలో ఒక్క కరోనా పొజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. చదవండి: కరోనా: ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శానిటైజర్! ఇక రైల్వేపోలీస్ డీఎస్పీ బోస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రయాణికులల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈచ్ వన్ టీచ్ వన్ అన్న రీతిలో ప్రయాణికుల్లో చైతన్యం కలుగిస్తున్నామని కూడా చెప్పారు. కాగా ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచిస్తున్నామన్నారు. అదే విధంగా టికెట్ కౌంటర్ల వద్ద వన్ మీటర్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయోద్దని, అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నట్లు డిఏస్పీ తెలిపారు. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో రాజేంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (08501) ఏప్రిల్ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11.00 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–విశాఖ రైలు (08502) ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 4.30కు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. విశాఖపట్నం–తిరుపతి ప్రత్యేక రైలు (08573) ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 10.55కు విశాఖ బయలుదేరుతుంది. తిరుపతి–విశాఖపట్నం రైలు (08574) ఏప్రిల్ 2, 9, 16, 23, 30 మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25వ తేదీల్లో మధ్యాహ్నాం 3.30కు తిరుపతిలో బయలుదేరుతుంది. జబల్పూర్–తిరునల్వేలి ప్రత్యేక రైలు.. జబల్పూర్–తిరునల్వేలి ప్రత్యేక రైలు (02194) ఏప్రిల్ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 9.30కు జబల్పూర్లో బయలుదేరుతుంది. తిరునల్వేలి–జబల్పూర్ రైలు (02193) ఏప్రిల్ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5.45కు తిరునల్వేలిలో బయలుదేరుతుంది. మచిలీపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07049) ఏప్రిల్ 7, 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 3.05కు మచిలీపట్నంలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–మచిలీపట్నం రైలు (07050) ఏప్రిల్ 7, 14, 21, 28వ తేదీల్లో రాత్రి 11.55కు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. నర్సాపూర్–హైదరాబాద్ రైలు (07258) ఏప్రిల్ 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. హైదరాబాద్–విజయవాడ రైలు (07257) ఏప్రిల్ 8, 15, 22, 29వ తేదీల్లో రాత్రి 10.20కి హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.35కు విజయవాడ చేరుకుంటుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రాజశేఖర్ కోరారు. -
వేసవికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పిఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07942) మార్చి 4, 11,18,25 తేదీల్లో, ఏప్రిల్ 1,8,15,22,29, మే 6,13,20,27, జూన్ 3,10,17,24 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్–రేణిగుంట రైలు (07941) మార్చి 5,12,19,26, ఏప్రిల్ 2,9,16,23,30 మే 7,14,21,28, జూన్ 4,11,18,25 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.00కు రేణిగుంట చేరుతుంది. తిరుపతి–నాగర్సోల్ రైలు (07417) మార్చి 2,9,16,23,30 తేదీల్లో, ఏప్రిల్ 6,13,20,27, మే 4,11,18,25, జూన్ 1,8,15,22,29 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11.55కు నాగర్సోల్ చేరుకుంటుంది. నాగర్సోల్–తిరుపతి రైలు (07418) మార్చి 3,10,17,24, ఏప్రిల్ 7,14,21,28, మే 5,12,19,26, జూన్ 2,9,16,23,30 తేదీల్లో రాత్రి 10.00 గంటలకు నాగర్సోల్లో బయలుదేరి రెండోరోజు ఉదయం 4.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. -
నిఘా నిస్తేజం
♦ రైళ్లలో పెరుగుతున్న చోరీలు ♦ విఫలమవుతున్న భద్రత బలగాలు బిట్రగుంట : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిఘా వ్యవస్థ నిస్తేజంగా మారింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ విభాగాల్లో సిబ్బంది కొరత, ఫీల్డ్ ఇంటెలిజన్స్, ఇన్ఫార్మర్ల వ్యవస్థలకు ప్రాధాన్యం తగ్గిపోవడంతో రైళ్లలో దొంగలు విజృంభిస్తున్నారు. తాజాగా సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఐపీఎస్ అధికారిపై జరిగిన దాడితో పాటు డివిజన్ పరిధిలో గడిచిన రెండు నెలల కాలంలో జరిగిన చోరీ ఘటనలే ఇందుకు నిదర్శనం. మత్తు మందు ఇచ్చి దోచుకునే ఉత్తరాది ముఠాలతో పాటు ఒంగోలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన లోకల్ గ్యాంగ్‌లు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు అధికారుల వద్ద సమాచారం ఉన్నా నేరాల నియంత్రణకు, దొంగల ఆటకట్టించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. సిబ్బంది కొరత, స్పష్టమైన సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్లు లేకపోవడం, ఇతర కేసుల్లో మాదిరి సాంకేతిక పరిజ్ఞానం అక్కరకు రాకపోవడం వంటి సమస్యలతో నిఘా వ్యవస్థ విఫలమవుతోంది. దీంతో రైలు ప్రయాణమంటేనే ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. వరుస చోరీలతో ఆందోళన సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో మనుబోలు వద్ద పట్టపగలే వికలాంగుల బోగీలో ఉన్న మహిళా ఐపీఎస్ అధికారిపై దాడి చేసి నగలు, నగదు దోచుకుపోయిన తాజా ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. జూలైలో చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో మత్తుమందిచ్చి ప్రయాణికులను దోచుకున్న విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. గత నెల్లో కేరళ ఎక్స్‌ప్రెస్‌లో మత్తుమందిచ్చి ఢిల్లీకి చెందిన దంపతుల వద్ద భారీగా నగలు, నగదును చోరీ చేశారు. చోరీలకు పాల్పడింది ఉత్తరాదికి చెందిన ముఠాలేనని అధికారులు అనుమానిస్తున్నారు. గత గురువారం ఖమ్మం జిల్లా డోర్నకల్ సమీపంలో నాందేద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి ఏడుగురు మహిళల మెడల్లోని నగలను దోచుకువెళ్లారు. నిత్యం ఎక్కడో చోట రైళ్లలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో 200కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే రూ.మూడు కోట్లకు పైగా ప్రయాణికుల సొత్తు దొంగలపాలైంది. అడుగడుగునా భద్రత లోపం.. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో అడుగడుగునా భద్రత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ బోగీల్లోకి సాధారణ ప్రయాణికులను అనుమతించడం, స్లీపర్ కాస్ల్‌లతో పాటు థర్డ్ ఏసీ కోచ్‌లలోకీ ఇతరులను అనుమతించేస్తున్నారు. ప్రయాణికుల్లా ఎక్కుతున్న దొంగల ముఠాలు వేకువ సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా లగేజీలతో దిగిపోతున్నారు. ఉదాహరణకు సింహపురి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్లే సమయంలో చీరాల, ఒంగోలు స్టేషన్లలో సాధారణ ప్రయాణికులంతా స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్‌లలోకి ఎక్కేస్తుంటారు. వీరితో పాటు రిజర్వేషన్ కోచ్‌లలో ఎక్కే దొంగల ముఠాలు హస్తలాఘవం చూపించి మధ్యలో దిగిపోతుంటారు. అధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేయకుంటే ప్రయాణికులకు భద్రత కరువయ్యే పరిస్థితి తప్పదు. -
రైల్వే ఆదాయం అంతంత మాత్రమే!
విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడంతో రెండు నెలల నుంచి రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. అయితే రైళ్లకు ఈ సమైక్య సెగ తగలకపోవడంతో యథావిధిగా నడవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోగలిగింది. కానీ ఆదాయం పెరుగుదల అనుకున్నంత మేర రాలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయం పెంచుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు మరికొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేశారు. అయితే విజయవాడ రైల్వే డివిజన్లో గత సంవత్సరం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు ఈ ఏడాది ఏర్పాటు చేసిన అదనపు రైళ్లు, కోచ్‌లు ఈ విధంగా ఉన్నాయి. 2012-13లో ఆగస్టులో విజయవాడ మీదుగా 23 ప్రత్యేక రైళు,్ల సెప్టెంబర్ నెలలో 34 ప్రత్యేక రైళ్లు నడిచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలలో 62, సెప్టెంబర్ నెలలో 90 ప్రత్యేక రైళ్లు నడిచాయి. అదేవిధంగా విజయవాడ డివిజన్లో ఈ ఆగస్టులో 10, సెప్టెంబర్‌లో 12 ప్రత్యేక రైళ్లను నడపగా వీటి ద్వారా 10 రైళ్లకు గానూ రూ.22,21,887 ఆదాయం రాగా, సెప్టెంబర్‌లో నడిపిన 12 రైళ్లకు గానూ రూ.31,43,900 ఆదాయం లభించింది. ఇవి కాక పలు రైళ్లకు 2012-13 సంవత్సరంలో ఆగస్టు నెలలో 76 అదనపు కోచ్‌ల ద్వారా రూ. 29,48,622 ఆదాయం, సెప్టెంబర్‌లో 83 అదనపు కోచ్‌ల ద్వారా రూ.29,94,440 ఆదాయం లభించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో 33 అదనపు కోచ్‌లకు గానూ రూ.9,53,160 ఆదాయం రాగా, సెప్టెంబర్ నెలలో నడిపిన 37 అదనపు కోచ్‌లకు గానూ రూ.14,54,857 ఆదాయం లభించింది. దీని ద్వారా రైల్వేకు వచ్చిన ఆదాయం నామమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా ప్రతిరోజు దాదాపు 500 నుంచి600 బస్సులు నడుస్తూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉండేవి. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన వద్ద నుంచి ప్రయాణికులు తమ రాకపోకలను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఈ సమ్మె కొనసాగినట్లయితే ఆ ప్రభావం అన్ని విభాగాలపై పడే అవకాశముంటుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.