ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే ఆసుపత్రుల్లో సైతం కరోనా వార్డులను ఏర్పాటు చేసినట్లు విజయవాడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ సురేష్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యంత రద్ధీ గల రైల్యే స్టేషన్లలో విజయవాడ ఒకటని చెప్పారు. ఈ స్టేషన్ నుంచి ప్రతి రోజు రెండు వందల రైళ్లు రాక పోకలు సాగిస్తుంటాయని తెలిపారు. అదే విధంగా సూమారు లక్ష 30 వేల మంది ప్రయాణం చేస్తుంటారన్నారు.
చదవండి: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు
కాగా జనసమూహం ఎక్కువగా ఉండటంతో కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపట్టామని, పాసింజర్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. అంతేగాక ముఖ్యమైన ప్రదేశాలలో వాల్ పోస్టర్లు డిస్ ప్లే చేయడం, ప్రయాణికులకు అవగాహన కోసం ప్రకటనలు చేయిస్తున్నామని తెలిపారు. రైల్యే సిబ్బంది కూడా శానిటైజర్స్, మాస్క్ లు, గ్లౌజులు ధరించి పనిచేస్తున్నారని చెప్పారు. క్లినింగ్‌లో సోడియం ఐసోక్లోరైడ్ వాడుతున్నామన్నారు. కాగా విజయవాడ మీదుగా నడిచే 7 ప్రత్యేక రైళ్ల సర్వీసులు రద్ద చేయగా.. ప్రతిరోజు క్రమంగా నడిచే రైల్లు మాత్రం యదావిధిగా నడుస్తాయని చెప్పారు. ఇక ఈ స్టేషన్ పరిధిలో ఒక్క కరోనా పొజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆయన వెల్లడించారు.
చదవండి: కరోనా: ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శానిటైజర్!
ఇక రైల్వేపోలీస్ డీఎస్పీ బోస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రయాణికులల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈచ్ వన్ టీచ్ వన్ అన్న రీతిలో ప్రయాణికుల్లో చైతన్యం కలుగిస్తున్నామని కూడా చెప్పారు. కాగా ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచిస్తున్నామన్నారు. అదే విధంగా టికెట్ కౌంటర్ల వద్ద వన్ మీటర్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయోద్దని, అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నట్లు డిఏస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment