
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్–యశ్వంత్‌పూర్ మధ్య 6 వారంతపు సర్విసులు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–యశ్వంత్‌పూర్ (07687) ఈ నెల 14, 21, 28 తేదీలలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి 7.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
అక్కడ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07688) ఈ నెల 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.