15న పలు రైళ్ల రద్దు | On june15 multiple Trains canceled | Sakshi
Sakshi News home page

15న పలు రైళ్ల రద్దు

Published Sat, Jun 13 2015 1:12 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

15న పలు రైళ్ల రద్దు - Sakshi

15న పలు రైళ్ల రద్దు

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-ముద్ఖేడ్ సెక్షన్‌లోని కాపలా లేని రైల్వే గేట్ల వద్ద నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 15వ తేదీన పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగానూ రద్దు కానున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో  ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ మేరకు నాందేడ్-నిజామాబాద్, నాందేడ్-మేడ్చల్, నిజామాబాద్-బోధన్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు పూర్తిగాను, బోధన్-మిర్జాపల్లి ప్యాసింజర్ బోధన్ నుంచి నిజామాబాద్ వరకు పాక్షికంగానూ రద్దు కానున్నాయి. కాచిగూడ-మన్మాడ్, పుణే-నిజామాబాద్ ప్యాసింజర్ రైళ్లను ఈ మార్గంలో 35 నిమిషాల నుంచి గంటకు పైగా ఆలస్యంగా నడుపుతారు. అలాగే సుల్తానాబాద్-కరీంనగర్ మార్గంలో నిర్మాణపనుల కారణంగా ఈ నెల 15న కరీంనగర్-సిర్పూర్ కాగజ్‌నగర్ ప్యాసింజర్ ట్రైన్ రద్దు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement