
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కోవిడ్ కారణంగా ప్రయాణికులు లేక పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే..
► చెన్నై సెంట్రల్–హైదరాబాద్ (02603/02604), నర్సాపూర్–నిడదవోలు (07241/07242), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (07237/07238) రైళ్లను ఈ నెల 16 వతేదీ నుంచి జూలై 15 వరకు..
► చెన్నై సెంట్రల్–నాందేడ్ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి జూలై 17 వరకు ..
► తిరుపతి–చెన్నై సెంట్రల్ (06204/06203) ఈ నెల 16వ తేదీ నుంచి రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment