వరదల కారణంగా తమిళనాడు, చెన్నై మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్లే తెలిపింది. దీంతో చెన్నై - గూడూరు మధ్య పలు రైళ్లు రద్దయ్యాయి. శనివారం నుంచి ఈనెల 8 వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు.ఇప్పటి వరకూ 35 రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో వైపు శని, ఆదివారాల్లో కాకినాడ, చెన్నై ఎగ్మోర్, కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఇక చెన్నై - విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలు కూడా రద్దైంది.