పలు రైళ్ల ర ద్దు.. దారి మళ్లింపు
కాజీపేట రూరల్ : రైల్వే రవాణపై హుదూద్ ప్రభావం పడింది. భారీ తుపాన్ కారణంగా ఆదివారం కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే ప లు రద్దు కాగా మరికొన్ని రైళ్లు దారి మళ్లిం చారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రద్దైయిన రైళ్లు ఇవే..
భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020), ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019), విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ (22203), సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ (22204), హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728), విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గరీభ్థ్ ్రఎక్స్‌ప్రెస్ (12740), నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (18510) రద్దయిన ట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
దారి మళ్లించిన రైళ్లు..
నాందేడ్ నుంచి సంబల్‌పూర్ వెళ్లే సంబల్‌పూ ర్ ఎక్స్‌ప్రెస్ (18310 ) వయూ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉండగా వయా బల్లార్షా మీదుగా... హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18640 )వయా బల్లార్షా మీదుగా, హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ (12704) వయా బల్లార్షా మీదుగా దారి మళ్లించారు.
కాజీపేటలో హెల్ప్‌లైన్ ఏర్పాటు
హుదుద్ ప్రభావం నేపథ్యంలో కాజీపేట జంక్షన్‌లో హెల్ప్‌లైన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. 0870-2576430, రైల్వే నంబర్ 82660కు ఫోన్ చేయూలని రైల్వే అధికారులు ప్రయూణికులకు విజ్ఞప్తి చేశారు.